Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...బీజేపీకి షాక్.. కీలక వ్యక్తి రాజీనామా
posted on: Jun 19, 2018 6:31PM

వేరే పార్టీల్లో ఉన్న వ్యక్తులు, రాజీనామా చేసి అధికారంలో ఉన్న పార్టీలోకి రావడం కామన్.. కానీ ఓ వ్యక్తి అధికారంలో ఉన్న బీజేపీకే రాజీనామా చేసి షాకిచ్చాడు.. బీజేపీ జాతీయ కార్యదర్శి 'రామ్ మాధవ్' ప్రచార బృందంలో 'శివం శంకర్ సింగ్' అనే వ్యక్తి ప్రముఖ పాత్ర పోషించాడు.. 2014 లో బీజేపీ అధికారంలోకి రావడానికి తనవంతు కృషి చేసాడు..
ఇప్పుడు 'నేను మోడీ మాయలో పడి తప్పు చేశాను' అంటూ బీజేపీకి రాజీనామా చేసి మోడీ మీద, పార్టీ మీద తీవ్ర విమర్శలు చేసాడు.. 2013 లో మోడీ అభివృద్ధి మంత్రాన్ని నమ్మాను, దేశ రాజకీయాల్లో మోడీ ఒక ఆశాకిరణంలా కనిపించారు.. కానీ ఇప్పుడు ఆ నమ్మకం పోయింది.. నాలుగేళ్ళ మోడీ పాలనలో మంచికంటే చెడే ఎక్కువ జరిగింది.. బీజేపీ ప్రచార వ్యూహాలతో ప్రజల్ని మభ్యపెడుతుంది.. ప్రజలు గుడ్డిగా నమ్మి వీటి మాయలో పడొద్దు అంటూ శంకర్ సింగ్ వ్యాఖ్యానించాడు..
అలానే నోట్ల రద్దు పెద్ద వైఫల్యమని తెలిసినా బీజేపీ ఒప్పుకోదని, నోట్లరద్దు వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందని శంకర్ అన్నాడు.. జీఎస్టీ కూడా ఆదరాబాదరాగా ప్రవేశపెట్టారని, ఇప్పటికీ గందరగోళంగానే ఉందని విమర్శించాడు.. సిబిఐ, ఈడీలు బీజేపీ గుప్పిట్లో ఉన్నాయని.. మోడీ, అమిత్ షాలకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే వారి మీద వెంటనే దాడులు జరుగుతాయని ఆరోపించారు.. శివం శంకర్ సింగ్ బీజేపీకి రాజీనామా చేయడమే గాక వెళ్తూ వెళ్తూ ఘాటు విమర్శలు చేయడంతో బీజేపీ నాయకులు షాక్ తిన్నట్టు తెలుస్తుంది.






