Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...AI విప్లవంలో బిలియన్ల డాలర్ల వర్షం.. మరి మన ఐటీ స్టాక్స్ ఎందుకు పడిపోతున్నాయి?
posted on: Jun 4, 2026 9:47AM

ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా ఏఐ ప్రభంజనం నడుస్తోంది. ఓపెన్ ఏఐ, ఆంత్రోపిక్ వంటి అగ్రగామి గ్లోబల్ కంపెనీలు ఏఐ మోడల్స్ ద్వారా బిలియన్ల కొద్దీ డాలర్ల ఆదాయాన్ని ఆర్జిస్తున్నాయి. అయితే ఇక్కడే ఒక పెద్ద చిక్కు వచ్చి పడింది. ఒకవైపు గ్లోబల్ ఏఐ కంపెనీల ఆదాయం ఊహించని స్థాయిలో దూసుకుపోతుంటే, మరోవైపు మన దేశీయ ఐటీ దిగ్గజాలైన టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి స్టాక్స్ మాత్రం ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నాయి. అసలు ఏఐ విప్లవం వల్ల భారతీయ ఐటీ కంపెనీల షేర్లకు ఎందుకు బూస్ట్ లభించడం లేదు? ఈ కీలకమైన ప్రశ్నను లేవనెత్తారు ప్రముఖ ఇన్వెస్టర్, హెలియోస్ క్యాపిటల్ మేనేజ్‌మెంట్ వ్యవస్థాపకుడు సమీర్ అరోరా. ఆయన సోషల్ మీడియా వేదికగా పంచుకున్న విశ్లేషణ ఇప్పుడు స్టాక్ మార్కెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
సాధారణంగా గ్లోబల్ కంపెనీలకు ఏఐ టెక్నాలజీని అమల్లోకి తీసుకురావడానికి, అంటే ఇంప్లిమెంటేషన్ కోసం భారీగా ఐటీ సేవల అవసరం ఉంటుందని అందరూ భావిస్తారు. మన దేశీయ ఐటీ కంపెనీలు కూడా మేము ఏఐ ట్రాన్స్‌ఫార్మేషన్‌కు ఒక వంతెనలా పనిచేస్తాం అని ప్రకటిస్తూ వస్తున్నాయి. కానీ క్షేత్రస్థాయిలో జరుగుతున్నది వేరొకలా ఉంది. సమీర్ అరోరా కొన్ని సంచలన గణాంకాలను బయటపెట్టారు. ప్రస్తుతం ఆంత్రోపిక్ కంపెనీ వార్షిక ఆదాయ రన్ రేట్ దాదాపు 50 బిలియన్ డాలర్లకు చేరుకుంది. అలాగే చాట్ జీపీటీని సృష్టించిన ఓపెన్ ఏఐ ఆదాయ రన్ రేట్ కూడా సుమారు 30 బిలియన్ డాలర్ల మార్కును తాకింది. ఈ భారీ ఆదాయంలో సింహభాగం కార్పొరేట్ లేదా ఎంటర్‌ప్రైజ్ కస్టమర్ల నుంచే వస్తోంది. ఒకవేళ ఆంత్రోపిక్ కంపెనీ ఈ ఏడాది ఐపీఓకి వెళ్తే, వచ్చే ఏడాది నాటికి దీని ఆదాయ రన్ రేట్ ఏకంగా 100 బిలియన్ డాలర్లను దాటే అవకాశం ఉందని అంచనా.
ఇంత పెద్ద ఎత్తున గ్లోబల్ సంస్థలు ఏఐ మోడల్స్ కోసం నేరుగా బిలియన్ల డాలర్లు ఖర్చు పెడుతుంటే, మరి భారతీయ ఐటీ సర్వీస్ కంపెనీలు ఇంకా ప్రాజెక్టుల కోసం ఎందుకు నిరీక్షిస్తున్నాయి? ఐటీ సంస్థల సహాయం లేకుండానే ఈ కార్పొరేట్ కంపెనీలు ఇంత భారీ మొత్తాన్ని ఎలా ఖర్చు చేయగలుగుతున్నాయి? వారికి ఈ టెక్నాలజీని వాడుకోవడంలో ఎవరు సహాయం చేస్తున్నారు? అనే ప్రశ్నలను అరోరా సంధించారు. లాజికల్‌గా చూస్తే ఏఐ సాంకేతికత ఇంకా ఎదుగుతున్న దశలోనే ఉంది కాబట్టి, కంపెనీలకు ఇప్పుడు ఎక్కువ సహాయం అవసరం కావాలి. కానీ ఎవరి అండ లేకుండానే గ్లోబల్ సంస్థలు సొంతంగా ఏఐని అందిపుచ్చుకుంటున్నట్లు కనిపిస్తోంది. దీన్ని బట్టి చూస్తే ఐటీ సర్వీస్ కంపెనీలు అనుకుంటున్నంత స్థాయిలో వీటికి బాహ్య సహాయం అవసరం లేదేమోననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ అనిశ్చితి ఇలా ఉంటే, దేశీయ మార్కెట్లో ఐటీ స్టాక్స్ తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాయి. గడచిన మూడు రోజుల్లో లాభపడిన ఐటీ షేర్లు, మార్కెట్ అమ్మకాల ఒత్తిడి కారణంగా ఒక్కసారిగా కుప్పకూలాయి. నిఫ్టీ ఐటీ ఇండెక్స్ దాదాపు 6 శాతం మేర పతనమై 29,301 పాయింట్లకు పడిపోయింది. ఆ రోజు ఎన్ఎస్ఈలో అత్యంత దారుణంగా నష్టపోయిన రంగాగా ఐటీ నిలిచింది. ముఖ్యంగా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) షేరు ఏకంగా 9 శాతం నష్టపోయి 2,224.80 రూపాయల వద్ద ముగిసింది. ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్రా వంటి భారీ కంపెనీల షేర్లు కూడా 4 నుంచి 6 శాతం వరకు పతనమయ్యాయి. ఎల్‌టీఐమైండ్‌ట్రీ 8 శాతం కంటే ఎక్కువ నష్టపోగా, కోఫోర్జ్, పర్సిస్టెంట్ సిస్టమ్స్ చెరో 6 శాతం క్షీణించాయి. గ్లోబల్ ఏఐ విప్లవంలో అసలైన విజేతలు మోడల్స్ తయారు చేసే కంపెనీలా లేక వాటిని ఇంప్లిమెంట్ చేస్తామనే ఐటీ కంపెనీలా అనే సందిగ్ధత ఇన్వెస్టర్లలో నెలకొనడమే ఈ పతనానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది.



.webp)


