జెన్ జీని టార్గెట్ చేస్తున్న‌ కాక్రోచ్ దీప్కే ఎవ‌రి ఏజెంట్?

posted on: Jun 2, 2026 12:24PM

కొన్ని రోజులుగా సోషల్ మీడియాను ప‌ట్టి ఊపేస్తున్న  కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ)  వెనకున్న వ్యక్తి   అసలు రంగు బయటపడింది. ఈ పార్టీని ప్రారంభించిన వ్యక్తి ఒక సాధారణ సోషల్ మీడియా వినియోగదారుడు కాదు.  ఇతడు ఆమ్ ఆద్మీ పార్టీ-(ఆప్) తో బ‌ల‌మైన‌ సంబంధాలు కలిగిన వ్యక్తి.   ప్రస్తుతం అమెరికాలో నివసిస్తున్నాడు. 

దాదాపు  నెల రోజులుగా.. ఏదో ఒక సందర్భంలో భారత దేశంలో సివిల్ వార్ రావాల‌ని ఆప్ నేతలు తీవ్రంగా ఆశిస్తున్నారు. మ‌రో నేపాల్ లా  ఈ భార‌త దేశాన్ని కూడా చేసి, ఒక ఆట ఆడుకోవాల‌న్న‌ది వీరి అస‌లు సిస‌లు ఎత్తుగ‌డ‌. ఇప్పుడొక తోకపార్టీ వచ్చింది. వాళ్ల టార్గెట్ జెన్ జి కిడ్స్. వారిని తేలిగ్గా మోటివేట్ చేయొచ‌న్న‌ది వారి దూరాలోచ‌న‌. ఇది దురాలోచ‌న కూడా. 

ఒవ‌రాల్ గా బొద్దింక జ‌న‌తా పార్టీ సృష్టిక‌ర్త..  అభిజీత్ దిప్కే వ్యూహాలేంటి?  బయటపడిన వాస్త‌వాలు ఎలాంటివి? అని  చూస్తే..  ఇందులో అత్యంత ప్ర‌ధాన‌మైన‌ది..  భారతదేశానికి వ్యతిరేకంగా జరిగే నిరసనలను ప్రమోట్ చేయ‌డం. ఇక పోతే కుల రాజకీయాలు. సమాజంలో కుల రాజకీయాలను ఎంతో తెలివిగా రెచ్చగొడుతుంటాడు మిస్ట‌ర్ దీప్కే. ఇత‌డి మెయిన్ టార్గెట్ గ్రూపు   జనరల్ కేటగిరీ (జీసీఎస్). ఈ వ‌ర్గం ప్ర‌జ‌ల‌ను త‌ర‌చూ టార్గెట్ చేస్తుంటాడు దీప్కే. 

ఇదొక  రెండు ముఖాల నాటకం. డ‌బుల్ ఫేస్ డ్రామా అన్న‌మాట‌. పైకి కాంగ్రెస్, బీజేపీ ఇద్దరినీ టార్గెట్ చేస్తున్నట్లు కనిపిస్తూ.. లోలోపల మాత్రం ఆప్ జెండాను మోస్తూ..  ఆ పార్టీ ఎజెండాను జ‌నాల్లోకి ప్ర‌వేశ‌పెడుతుంటాడ‌న్న‌మాట‌.   ఇత‌డు చేసే అతి పెద్ద మిరాకిల్ ఏంటో చూస్తే.. బోట్ అండ్ పీఆర్ ప్రమోషన్. ఇవెలాంటివంటే..  సోషల్ మీడియాలో భారీగా పీఆర్ చేస్తూ.. బోట్ అంటే, ఫేక్ అకౌంట్లను త‌న పార్టీ ప్రమోషన్ కోసం వాడుతున్నాడు.   ప్రతి పోస్ట్‌కి తక్కువ లైకులు, కానీ రికార్డు సమయంలో భారీ ఫాలోవర్లు. ఇదెలా  సాధ్య‌ం అని చూస్తే.. ఇదొక  ఫేక్ బోట్ ఫాలోయ‌ర్స్ క్రియేష‌న్ అన్న‌మాట‌.  

ఆప్ తో ఇత‌డికున్న‌ కనెక్షన్ ఎలాంటిదో చూస్తే..  ఇందులో ఈ పార్టీకి  చెందిన పెద్ద నేతల ప్రమోషన్ ఇంట‌ర్న‌ల్ గా చేస్తుంటాడు.  ఈ కాక్రోచ్ జనతాపార్టీని  దీప్కే ప్రమోట్ చేయడంలో ఆప్ పార్టీకి చెందిన పలువురు పెద్ద నేతలు  కీలక పాత్ర పోషిస్తుండ‌ట‌మే  ఇందుకు ఉదాహ‌ర‌ణ‌. 

ఇందుకోసం విప‌రీతంగా డ‌బ్బు ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇదంతా  ఎందుకంటే  ఆప్ ఎజెండాను యువ‌త‌లోకి బ‌లంగా తీసుకెళ్ల‌డానికి ఇదొక పొలిటిక‌ల్ ఫేస్ క‌ట్ అన్న‌మాట‌.  2019లో కాశ్మీర్ అంశంపై రెచ్చగొట్టే పోస్టులు పెట్టినందుకు.. అభిజీత్ దిప్కేపై పోలీసు కేసు కూడా నమోదైనట్లు సమాచారం. భారతదేశ సార్వభౌమత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేసిన బ్యాగ్రౌండ్ ఉంది ఇత‌డికి. 

జెన్ జీ యువతకు విజ్ఞప్తి చేస్తున్న‌ట్టు క‌నిపిస్తాడు. యువతలో ఉన్న ఆవేశాన్ని, ఎమోషన్స్‌ని వాడుకుని క్యాష్ చేసుకోవాలని చూసే ఇలాంటి సోషల్ మీడియా అకౌంట్ల పట్ల చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవరినీ గుడ్డిగా నమ్మకండి! వివేకంతో వ్య‌వ‌హ‌రించండి!! ఇవీ యూత్ కి  విజ్ఞులైన  వారు చేసే విజ్ఞ‌ప్తి. యువతను రెచ్చగొట్టి, దేశంలో అస్థిరతను సృష్టించడం.. ఇలాంటి వారి ప్రధాన లక్ష్యం. విదేశాలలో కూర్చుని, సోషల్ మీడియా ద్వారా.. భారత యువతను మోసగించే ఈ వ్యూహాలు ఇందులో దాగి ఉన్న‌ట్టు గుర్తించండి.

దీప్కే సృష్టించిన కాక్రోచ్ జ‌నతా పార్టీ విష‌యంలో ప్ర‌ధానంగా చ‌ర్చించాల్సిన  అంశాలేంటంటే..   ఇది స్వ‌చ్ఛంద యువ ఉద్య‌మం కానే కాదు. పైకి ఇది త‌ట‌స్థ వేదిక‌గా క‌నిపించినా.. ఇందులో ఆప్ అజెండా  దాగి ఉంది. ఫేక్ ఫాలోయ‌ర్స్ ద్వారా ఒక ప్ర‌భంజ‌నం  సృష్టించాల‌న్న  కుయుక్తి కూడా ఉంది. విదేశాల నుంచి ఆప‌రేష‌న్ చేయ‌డం, కావాల‌నే ఇండియ‌న్ యూత్ ని టార్గెట్ చేయ‌డం.. స‌రైన ప‌ద్ద‌తి కాద‌ని గుర్తించండని అంటారు ప‌లువురు నిపుణులు. ఇందుకు 2019నాటి కాశ్మీర్ కేసు ఉదాహ‌ర‌ణ‌గా  చెప్పుకొస్తారు వీరు.

-సీతారాం కంఠంనేని

ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి https://www.teluguone.com పోర్టల్ ను  ఫాలో అవ్వండి. లైక్ చేయండి. షేర్ చేయండి. మీ విలువైన అభిప్రయాలను తెలియజేయండి.     

google-ad-img
    Related Sigment News
    • Loading...