ఈ కలయిక సంకేతమేంటి?
posted on: Feb 9, 2026 8:07AM

రాజకీయాలలో సంచలనంగా చెప్పదగిన అరుదైన కలయిక చెన్నైలో జరిగింది. రాజకీయ సినీ రంగాలకు చెందిన ముగ్గురు ప్రముఖులు చెన్నైలోని ఓ వివాహవేడుకలో కలిశారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, తమిళనాడు సీఎం స్టాలిన్, అలాగే ఇటీవలే సినీ రంగం నుంచి రాజకీయాలలోకి ప్రవేశించిన టీవీకే అధినేత దళపతి విజయ్ లు ఆదివారం (ఫిబ్రవరి 8) చెన్నైలో జరిగిన ఓ వివాహ వేడుకకు హాజరయ్యారు.
ముగ్గురూ ఓకే చోట కనిపించడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. వైసీపీ అధినేత జగన్ సమీప బంధువు అయిన వైఎస్ సునీల్ రెడ్డి కుమారుడు సాహిల్ రెడ్డి వివాహం చెన్నైలో జరిగింది. ఈ వివాహవేడుకకు సహజంగానే ఏపీ మాజీ సీఎం జగన్ హాజరయ్యారు. అలాగే తమిళనాడు సీఎం స్టాలిన్, టీవీకే అధినేత దళపతి విజయ్ కూడా హాజరయ్యారు. ఒకే కార్యక్రమంలో ఈ ముగ్గురూ కనిపించడం అందరి దృష్టినీ ఆకర్షించింది. అంతే కాకుండా వైఎస్ జగన్, దళపతి విజయ్ లు పక్కపక్కనే కూర్చుని ముచ్చటించుకుంటున్న దృశ్యాలు సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అయ్యాయి.



.webp)
.webp)
.webp)
.webp)


