బెంగాల్‌లో ఎస్ఐఆర్‌పై అమర్త్యసేన్ తీవ్ర ఆరోపణలు

posted on: Jan 24, 2026 5:21PM

 

పశ్చిమ బెంగాల్‌లో  కొనసాగుతున్న ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియపై ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ గ్రహీత అమర్త్యసేన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో హడావిడిగా చేస్తున్నా ఈ ప్రక్రియ ప్రజాస్వామ్య భాగస్వామ్యాన్ని ప్రమాదంలో పడేస్తుందన్నారు. ఓటర్ల జాబితాను సమీక్షించాలనుకోవడంలో తప్పులేదు. ప్రస్తుతం బెంగాల్‌లో జరుగుతున్నది అలా లేదు. ఓటు హక్కు నిరూపించుకోవడానికి అవసరమైన డాక్యుమెంట్స్ అందించడానికి తగిన సమయమివ్వాలి అని తెలిపారు. 

ఇది ఓటర్లకు అన్యాయం చేయడమే అవుతుంది. అంతేకాదు ఇది భారత ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీసే అవకాశం ఉందని పేర్కొన్నారు. త్వరల్లో బెంగాల్‌లో  ఎన్నికలు జరగనున్న తరుణంలో, ఎస్​ఐఆర్​ ప్రక్రియను అత్యంత వేగంగా, హడావుడిగా, అనవసర తొందరపాడుతో నిర్వహిస్తున్నారని, దీని వల్ల ప్రజాస్వామ్య భాగస్వామ్యం దెబ్బతినే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు.  "సమాజంలో వెనుకబడిన వర్గాలు, పేద ప్రజలు ఈ ఎస్​ఐఆర్​ ప్రక్రియ వల్ల తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది. పత్రాల సేకరణలో ఎదురయ్యే ఇబ్బందుల వల్ల వారు తమ ఓటు హక్కును కోల్పోయే ప్రమాదం ఉంది" అని అమర్త్యసేన్ అన్నారు.
 

google-ad-img
    Related Sigment News
    • Loading...