Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఆ సంక్షేమాధికారి అక్రమాస్తులు రూ. కోటిపైనే
posted on: Mar 3, 2026 8:39AM

శ్రీకాకుళం జిల్లాలో ఓ అవినీతి తిమింగళం ఏసీబీ అధికారులకు చిక్కింది. ఏబీసీడబ్యూఓ గడ్డి బాలముకుందరావు నివాసాలలో ఏసీబీ సోమవారం (మార్చి 2) నిర్వహించిన సోదాల్లో ఆయన అక్రమాస్తుల విలువ రూ.1.10లక్షలుగా తేలింది. గడ్డి బాలముకుందరావు నరసన్నపేట, సోంపేట విభాగాలకు ఇన్ చార్జిగా వ్యవహరిస్తున్నారు. వసతి గృహాల బిల్లుల మంజూరుకు ముడుపులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలపై ఏసీబీ అధికారులు జనవరిలో ఆయన కార్యాలయంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించగా, లెక్కల్లో చూపని సొమ్ము దాదాపు లక్షా 84 వేల రూపాయలు దొరికింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా
ఈ కేసు దర్యాప్తులో భాగంగా శ్రీకాకుళం పట్టణంలో బాల ముకుందరావుకు చెందిన రెండు ఇళ్లలో ఏసీబీ అధికారులు సోమవారం (మార్చి 2) ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో రాజాం, శ్రీకాకుళం, కొత్తవలస సబ్‌రిజస్ట్రార్ కార్యాలయాల పరిధిలోని 4 స్థిరాస్తుల పత్రాలు, 322 గ్రాముల బంగారు ఆభరణాలు, 1.75 కిలోల వెండి, నగదు, ఒక కారు, రెండు మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న ఆస్తుల మొత్తం విలువ రూ.1.10 కోట్లుగా ఉంటుందని ఏసీబీ అధికారులు తెలిపారు.


.webp)
.webp)


