Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...పెళ్లి కూతురిపై కాసుల వర్షం... ఎక్కడ చూసినా కుప్పలుగా నోట్లు
posted on: Feb 18, 2026 4:21PM

పెళ్లి వేడుకలో వధువుపై నోట్ల వర్షం కురిపించిన ఘటన పంజాబ్ రాష్ట్రంలో సంచలనంగా మారింది. తారన్ జిల్లాలో జరిగిన ఓ వివాహ వేడుకలో వధువు వేదికపై నిలబడి ఉండగా, వరుడు మరియు అతని కుటుంబ సభ్యులు భారీగా కరెన్సీ నోట్లు చల్లి సంబరాలు జరుపుకున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
వైరల్ అవుతున్న పోస్టుల ప్రకారం, వధువుపై సుమారు రూ.8.5 కోట్లు విలువ చేసే నగదు చల్లినట్టు ప్రచారం జరిగింది. అయితే ఈ వాదనలను వరుడి కుటుంబ సభ్యులు ఖండించారు. వరుడి సోదరుడు సికందర్ సింగ్ స్పందిస్తూ, రూ.8.5 కోట్లు ఖర్చు చేశామన్న ప్రచారం పూర్తిగా అసత్యమని స్పష్టం చేశారు. తమ కుటుంబ ప్రతిష్టను దెబ్బతీసేలా తప్పుడు ప్రచారం చేస్తున్న సోషల్ మీడియా హ్యాండిల్స్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు.
ఇక ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ఈవెంట్ మేనేజర్ మరియు డీజే నిర్వాహకులు కూడా వివరణ ఇచ్చారు. వేదికపై చల్లిన మొత్తం నగదు సుమారు రూ.4 లక్షల వరకు మాత్రమేనని తెలిపారు. అందులో ఎక్కువగా రూ.10 నోట్లు ఉండగా, కొన్ని డాలర్ నోట్లు కూడా వినియోగించినట్లు చెప్పారు. రూ.8.5 కోట్లు అన్నది పూర్తిగా అతిశయోక్తి అని స్పష్టం చేశారు.
అయితే భారీగా కరెన్సీ చల్లిన ఈ దృశ్యాలు నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. కొందరు ఇది ఆడంబరానికి నిదర్శనమని వ్యాఖ్యానిస్తుండగా, మరికొందరు ఇలాంటి ప్రదర్శనలు అవసరమా అంటూ ప్రశ్నిస్తున్నారు.మొత్తానికి, రూ.8.5 కోట్ల నోట్ల వర్షం అన్నది కేవలం సోషల్ మీడియా ప్రచారం మాత్రమేనని, వాస్తవానికి సుమారు రూ.4 లక్షల నగదే వినియోగించారని నిర్వాహకులు స్పష్టం చేయడం గమనార్హం.






