ఫిబ్రవరి 19 నుంచితెలుగు రాష్ట్రాలలో పెళ్లిళ్ల సందడి మొదలు
posted on: Feb 13, 2026 2:42PM

తెలుగురాష్ట్రాల్లో ఈ నెల 19వ తేదీ నుంచి వరుస ముహూర్తాలతో పెళ్లి సందడి ప్రారంభం కానుంది. గత ఏడాది డిసెంబర్ నుంచి ధనుర్మాసం.. మూఢమి కారణంలో ముహూర్తాలు లేక వివాహ శుభకార్యాలు జరగలేదు. ఇప్పుడు ఫిబ్రవరి 19 నుంచి నాలుగు నెలల పాటు శుభకార్యాలకు మంచి ముహూర్తాలు ఉండటంతో కల్యాణ వేదికలు కళకళలాడనున్నాయి.
పెళ్లి బాజాలు మోగనున్నాయి. డిసెంబర్ నుంచి ముహూర్తాలు లేక వివాహాలను వాయిదా వేసుకున్న వారు.. ఇక ఇఫ్పుడు తమ వివాహాలకు ముహూర్తాలు పెట్టేసుకోవడానికి రెడీ అయిపోతున్నారు. ఫిబ్రవరి నెలలో 19, 20, 21, 24, 25, 26 తేదీలలో వివాహ ముహూర్తాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు. అలాగే మార్చిలో 1, 3, 4, 7, 8, 9, 11, 12 తేదీలు, ఏప్రిల్‌లో 15, 20, 21, 25, 26, 27, 28, 29 తేదీలు, మేలో 1, 3, 5, 6, 7, 8, 13, 14, 21, 22, 23, 24, 25, 26, 27, 29 తేదీలలోనూ వివాహాలకు దివ్యమైన ముహూర్తాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు.
ఈ నాలుగు నెలలోనూ మంచి ముహూర్తాలు ఉండటంతో ఆయా తేదీలలో వివాహాలు చేసుకోవాలనుకుంటున్నవారు కల్యాణమంటపాలను ముందుగానే బుక్ చేసుకునేందుకు తొందరపడుతున్నారు.






