Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...మదర్ థెరిసా సేవకురాలేనా?
posted on: May 27, 2026 2:36PM

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సెయింట్ ఆఫ్ ది గట్టర్స్ గా పిలిచే- మదర్ థెరిసా గురించి ఇటీవల కొన్ని కొత్త వాదనలు తెరపైకి వస్తున్నాయి. ఆల్బేనియా దేశానికి చెందిన థెరిసా, తన మాతృదేశంలో కమ్యూనిస్టులు క్రైస్తవ మతాన్ని నిషేధించిన పరిస్థితుల్లో, తన మత ప్రచారం కోసం భారతదేశానికి వచ్చారు. తమ స్వదేశంలో నిషేధించిన మత ప్రచారాన్ని, కమ్యూనిస్టుల సాయంతో ఆమె భారతదేశంలో చేపట్టారు అనేది ఇప్పుడు తెరపైకి వచ్చిన ఒక కొత్త వాదన.
దీని ప్రకారం చూస్తే.. కలకత్తాలో థెరిసా తన మతాన్ని విస్తరించడానికి కమ్యూనిస్టులే సాయం చేశారు. తమ మాతృదేశంలో క్రైస్తవ మతాన్ని నిషేధించిన అదే కమ్యూనిస్ట్ శక్తులు, భారతదేశంలో మాత్రం థెరిసా కార్యకలాపాలకు మద్దతు ఇచ్చాయన్న ఆరోపణలు ఉన్నాయి. భారత్ బలపడితే ముందుగా నష్టపోయేవి చైనా వంటి కమ్యూనిస్ట్ దేశాలే. అందుకే తమ దేశంలో నిషేధించిన మతాన్ని భారత్ లో తమ ఆయుధంగా వాడుకున్నారు.. ఈ వాదన మరింత వివాదాస్పదంగా మారింది.
ప్రపంచ వ్యాప్తంగా థెరిసా పట్ల ఒక అద్భుతమైన మాతృత్వ ప్రతీకగా గుర్తింపు ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ కథనాల వెనుక దాచిన కొన్ని సంఘటనలు తిరిగి చర్చనీయాంశంగా మారాయి. అవెలాంటివో చూస్తే.. థెరిసా పసి పిల్లలను అమ్ముకున్న విషయం.. చనిపోయేవారికి బలవంతంగా బాప్టిజమ్ ఇచ్చిన ఆరోపణలు, నిర్మల్ హృదయ్ మానసిక రోగుల ఆశ్రమంగా మార్చడం వంటివి. పాశ్చాత్య పత్రికలు సైతం నిర్మల్ హృదయ్ పరిస్థితులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన మాట కఠిక వాస్తవం. అయినా ఆ విషయాలు ఎంతగానో దాచి ఉంచారు.
మదర్ థెరిసాది అసలు దాతృత్వమా? వాటికన్ సిటీకి ఇక్కడి నుంచి చేస్తున్న సహాయమా? అన్నది అతి పెద్ద చర్చనీయాంశం. థెరిసా మీద ఉన్న అత్యంత తీవ్రమైన ఆరోపణలలో ఒకటి.. విరాళాల దుర్వినియోగం. విదేశాల నుంచి సేకరించిన విరాళాలలో వాటికన్‌కు పంపినది- 93శాతం కాగా, ఆమె దాతృత్వ సేవలకు వినియోగించినది కేవలం 7 శాతం మాత్రమేనన్న ఆరోపణలు ఉన్నాయి.
1991లో యూకే కార్యకలాపాలపై జరిపిన ఒక ఆడిట్‌లో.. సుమారు 2.6 మిలియన్ల డాలర్ల మొత్తం ఆదాయంలో కేవలం 7శాతం మాత్రమే దాతృత్వ పనులకు వెళ్ళిందని తేలింది. ఈ ఆడిట్ కేవలం ఒక్క దేశంలో, ఒక్క సంవత్సరానికి మాత్రమే జరిగింది. మిషనరీస్ ఆఫ్ ఛారిటీ 60 ఏళ్లకు పైగా పురాతనమైనది. 100కు పైగా దేశాలలో 700కి పైగా అనాథ ఆశ్రమాలను కలిగి ఉంది.
ప్రధాన ప్రశ్న ఏమిటంటే.. భారతదేశంలో నిస్వార్థ సేవ చేసినవారు లేరా? భారత్ లో మతం మార్చకుండా, నిస్వార్థంగా కులమతాలకు అతీతంగా సేవ చేసిన డొక్కా సీతమ్మలు వందలు, వేలల్లో ఉన్నారు అనేది నిప్పులాంటి నిజం. వీరెవరూ అంతర్జాతీయ గుర్తింపును పొందలేదు, మీడియా యుఫోరియాను సృష్టించుకోలేదు, కానీ వారి సేవ అచ్చమైనది, నిస్వార్థమైనది.
ఒక వ్యక్తి చుట్టూ ఒక కథనాన్ని నిర్మించడం, దానిని ప్రచారం చేయడం. సినిమాలు, మీడియా, రాజకీయ శక్తులతో బలపరచడం వలన వాస్తవాలు ఎలా మరుగున పడిపోతాయో ఇది చూపిస్తుంది. అసలు థెరిసా అంటేనే పెద్ద మోసం.. ఇది ఒక వైపు నుంచి వినిపించే ఆరోపణ. ఇక మరోవైపు, ఆమెను మన కన్న తల్లుల కన్నా ఎక్కువ స్థాయిలో కూర్చోబెట్టడం. ఇందులో నిజమేది? అన్నదింకా ఉత్కంఠ భరితంగానే ఉంది.
-సీతారాం కంఠంనేని
ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి https://www.teluguone.com పోర్టల్ ను ఫాలో అవ్వండి. లైక్ చేయండి. షేర్ చేయండి. మీ విలువైన అభిప్రయాలను తెలియజేయండి.






