కాంగ్రెస్ నాయకులకు హెచ్చరిక!
posted on: Jun 2, 2014 5:43PM
.jpg)
దేశవ్యాప్తంగా వున్న కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు ఆలిండియా పౌరుల తరఫున ఓ బాధ్యతగల పౌరుడి హెచ్చరిక. అదేంటంటే, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ సర్వనాశనం అయిపోయింది. అలా నాశనం అయిపోవడానికి ప్రధాన కారణం మీ పార్టీ నాయకులైన సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ వ్యవహారశైలేనని దేశంలో అందరికీ తెలిసిన విషయమే. వందేళ్ళకు పైగా చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీని ఈ ఇద్దరు తల్లీకొడుకులు పదేళ్ళలో నాశనం చేసిపారేశారు. ఈ విషయంలో చాలామంది కాంగ్రెస్ నాయకులకు సోనియా, రాహుల్ మీద పీకల వరకు కోపం వుంది. కార్యకర్తల్లో కూడా వాళ్ళిద్దరి నాయకత్వం మీద నమ్మకం పోయింది. వీళ్ళిద్దరూ కాంగ్రెస్ పార్టీ బాధ్యతల నుంచి తప్పుకుని కొత్తవారికి బాధ్యతలు ఇస్తే మంచిదన్న గుసగుసలు కాంగ్రెస్ పార్టీలో వినిపిస్తున్నాయి.
అయితే కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ విషయంలో బయటపడిపోయి సోనియా, రాహుల్‌కి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయొద్దని హెచ్చరిక. ఎందుకంటే వీళ్ళకి వ్యతిరేకంగా ఎవరు వ్యాఖ్యానించినా కాంగ్రెస్ పార్టీ వాళ్ళని పార్టీ నుంచి సాగనంపుతోంది. సోనియా, రాహుల్ తమ మీద వస్తున్న విమర్శలను పరిశీలించుకుని, ఆత్మ పరిశీలన చేసుకోకుండా, తమను విమర్శించిన వారిని పార్టీ నుంచి బయటకి పంపేయడమే మార్గమని భావిస్తున్నారు. అధికారాన్ని కోల్పోయినప్పటికీ తమ అహంభావాన్ని వదులుకోకుండా వ్యవహరిస్తున్నారు. అందుకే రాహుల్ గాంధీని కాంగ్రెస్ పార్టీలో ఒక జోకర్‌గా అభివర్ణించిన కేరళ కాంగ్రెస్ నాయకుడిని పార్టీ నుంచి తరిమేశారు. మరో రాజస్థాన్ కాంగ్రెస్ నాయకుడిని కూడా ఇంటికి సాగనంపారు. అంచేత కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సోనియా, రాహుల్ మీద ఎంత కోపం వున్నా మనసులోనే దాచుకోండి. బయటపడ్డారో మీ మీద వేటు పడటం ఖాయం. తస్మాత్ జాగ్రత్త.



.jpg)
.jpg)

.webp)



