Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...అనకాపల్లి జిల్లాలో వారి ఎనర్జీస్ భారీ పెట్టుబడి
posted on: Apr 17, 2026 10:07AM

ఆంధ్రప్రదేశ్ కు మరో భారీ పెట్టుబడి రానుంది. ప్రముఖ సంస్థ అయిన వారీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. అనకాపల్లి జిల్లాలో 8 వేల 175 కోట్ల రూపాయలతో అత్యాధునిక లిథియం అయాన్ బ్యాటరీ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు కంపెనీ రెడీ అయ్యింది. ఇందు కోసం ఆ కంపెనీకి ప్రభుత్వం నుంచి అవసరమైన అన్ని అనుమతులూ లభ్యమయ్యాయి. దీంతో త్వరలో ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని వారి ఎనర్జీ స్టోరేష్ సిస్టమ్ నిర్ణయించింది.
ఈ మెగా ప్రాజెక్ట్ కోసం అనకాపల్లి జిల్లా రాంబిల్లి ప్రాంతంలో ప్రభుత్వం 300 ఎకరాల భూమిని కేటాయించింది. ఇక్కడ ఏర్పాటు చేయబోయే యూనిట్ సుమారు 16 గిగావాట్ అవర్ ( సామర్థ్యంతో పనిచేయనుంది. ఈ ప్లాంట్‌లో కేవలం బ్యాటరీ ప్యాక్‌లు మాత్రమే కాకుండా, సెల్ తయారీ, ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్‌కు అవసరమైన విడిభాగాలను కూడా ఉత్పత్తి చేయనుంది.
ఈ భారీ పరిశ్రమ స్థాపన ద్వారా స్థానిక యువతకు ప్రత్యక్షంగా, పరోక్షంగా 3,000 మందికి పైగా ఉపాధి అవకాశాలు లభించే అవకాశాలున్నాయి. ప్రాజెక్టు మొదటి దశను వచ్చే ఏడాది జులై నాటికి పూర్తి చేసి ఉత్పత్తి ప్రారంభించాలని వారీ ఎనర్జీస్ సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది.
వారీ ఎనర్జీస్ కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంది. గుజరాత్ , అమెరికాలోని టెక్సాస్‌లో సోలార్ మాడ్యూల్స్ తయారీ యూనిట్లు ఉన్న ఈ సంస్థ, తన ఉత్పత్తులను ప్రపంచవ్యాప్తంగా 30కి పైగా దేశాలకు ఎగుమతి చేస్తోంది. ఇప్పుడు ఏపీలో ఏర్పాటు చేయబోయే ప్లాంట్ ద్వారా క్లీన్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ వాహనాల రంగానికి అవసరమైన బ్యాటరీ నిల్వ వ్యవస్థలను దేశీయంగానే అందించే అవకాశం ఉంటుంది.
రాబోయే రోజుల్లో ఈ ప్లాంట్ సామర్థ్యాన్ని 20 గిగావాట్ అవర్ వరకు పెంచాలని వారీ ఎనర్జీస్ సంస్థ భావిస్తోంది. బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ తయారీలో ఈ కేంద్రం దేశంలోనే కీలక భూమిక పోషించనుందని చెబుతున్నారు.






