Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...వాన్నా క్రై… అమెరికా ప్రపంచం మీద చేస్తోన్న దాడేనా?
posted on: May 18, 2017 11:47AM

వాన్నా క్రై… అంటే ఏడవాలని వుందా… అని అర్థం! నిజంగానే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది కంప్యూటర్ల యజమానులు ఏడుస్తున్నారు. తలలు పట్టుకుంటున్నారు. దేశాలకు దేశాలే తమ వ్యవస్థలు గందరగోళమైపోయి పిచ్చి చూపులు చూస్తున్నాయి. అయితే, లెటెస్ట్ న్యూస్ ఏంటంటే… వాన్నా క్రై కంటే ఇంకా ఎక్కువ ఏడిపించే వైరస్ మరొకటి ఆల్రెడీ సిస్టమ్స్ లోకి చొరబడిందట! చైనాలో ఈ సైబర్ పురుగును కనుగొన్నారట! అయినా… అసలు అమెరికా, నార్త్ కొరియా మధ్య కమ్ముకుంటోన్న యుద్ధ మేఘాలు మొదలు ప్రపంచంలో బోలెడు సమస్యలుండగా ఈ వైరస్ ల గోలేంటి? దీని వెనుక అసలు ఎజెండా ఏంటి?
కంప్యూటర్ల యుగం వచ్చాక వైరస్ లు కూడా మామూలైపోయాయి. ఎప్పుడూ ఏదో ఒక వైరస్ ల్యాప్ టాపుల్లోకి, డెస్క్ టాపుల్లోకి చొరబడి నానా డ్యామేజ్ చేస్తూనే వస్తోంది. కొత్తగా స్మార్ట్ ఫోన్లు కూడా లిస్ట్ లో చేరటంతో వైరస్ బాధ మరింత పెరిగిపోయింది. అయితే, ఇప్పుడొచ్చిన వాన్నా క్రై లాంటి వైరస్ లు సాధారణ పురుగుల కంటే బలమైనవి కావటంతో టెన్షనూ ఎక్కువే పెడుతుంటాయి. నష్టం కూడా ఎక్కువ తెస్తుంటాయి. అయితే, వీట్ని ప్రయోగించి హ్యాకర్లు డబ్బు లాగాలని చూస్తుంటారని అందరికీ తెలిసిందే. వాన్నా క్రై దెబ్బకి ఇప్పటికే 50వేల డాలర్లు చెల్లించారట ప్రపంచ వ్యాప్తంగా కంప్యూటర్ యూజర్లు. హ్యాకర్ల పంట పండిందనే చెప్పాలి!
వైరస్ ను ప్రయోగించి … కంప్యూటర్లను కూల్చి… డబ్బులు లాగటం… ఇంత వరకూ ఓకే! కాని, అసలు ఈ పని చేస్తోన్న హ్యాకర్లని ఏ దేశమూ పట్టుకోలేకపోవటం కాస్త విచిత్రమే. లేదంటే ఇప్పుడున్న రక్షణ వ్యవస్థల బలహీనత అనాలి. ఇకపోతే, ఇప్పుడు వాన్నా క్రై పేరుతో అందర్నీ ఏడిపిస్తోన్న వైరస్ పుట్టింది అమెరికాలోనే. సీఐఏ వారు ఇలాంటి ప్రమాదకర మాల్ వేర్ల లాంటివి ఇంకా బోలెడు తయారు చేసి దేశ దేశాల కంప్యూటర్లలోకి చొరబడాలని భావించారు. కానీ, అంతలోనే అవి కాస్తా అడ్డదారుల్లో లీకైపోయి హ్యాకర్ల చేతికి చిక్కాయి. వాళ్లు ఇప్పుడు వాన్నా క్రై రూపంలో మొదటి బాంబు మాత్రమే పేల్చారు. ఇంకా బోలెడు సైబర్ అరాచకాలు ముందు ముందు జరగవచ్చు!
వాన్నా క్రై వైరస్ ప్రబలటం వెనుక వున్న కథంతా చూస్తే ఒక్క అనుమానం ఎవరికైనా కలగక మానదు. ఇదంతా అనుకోకుండా జరిగిందా? అమెరికానే కావాలని చేయిస్తోందా? అమెరికా కాకుండా మరేదైనా శక్తి ఇలాంటి నాటకాలు ఆడుతూ అత్యంత కీలకమైన సమాచారం రాబడుతోందా? ఊరికే కోట్లాది కంప్యూటర్లు హ్యాకైతే ఎవరికైనా వచ్చే లాభం ఏముంటుంది? ఇలాంటి ప్రశ్నలు బోలెడు తలెత్తుతాయి. దేనికీ స్పష్టమైన జవాబు దొరక్కపోవచ్చు కాని…. వున్నట్టుండీ వైరస్ కలకలం బయలుదేరటం ఎవరో క్రిమినల్ మైండ్ వున్న సైబర్ నేరగాళ్ల పనిలా మాత్రం అనిపించదు. పక్క ప్లాన్ ప్రకారం చాలా పెద్ద లాభం ఆశించి చేసినట్టే అనిపిస్తుంది! అదేంటో ముందు ముందు తెలుస్తుండవచ్చు. అమెరికా పాత్రే ఈ వ్యవహారంలో కీలకం అవ్వొచ్చు!


.jpg)



