వివేకా హత్య కేసులో ముగిసిన ఈడీ సోదాలు.. ఎంపీ అవినాష్‌ ఇంట్లో రూ.24 లక్షలు సీజ్..!

posted on: Aug 21, 2026 7:19PM

 

వివేకా హత్య కేసుకు సంబంధించిన మనీలాండరింగ్‌ దర్యాప్తులో భాగంగా ఈడీ అధికారులు శుక్రవారం తెల్లవారుజామున నుంచే హైదరాబాద్‌, కడప జిల్లాల్లో నిర్వహించిన సోదాలు ముగిశాయి. మొత్తం ఆరు ప్రాంతాల్లో ఈడీ అధికారులు ఏకకాలంలో తనిఖీలు నిర్వహించారు. వైఎస్సార్‌సీపీ కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి, ఆయన తండ్రి వైఎస్‌ భాస్కర్‌రెడ్డికి సంబంధించిన నివాసాలతో సహా పలుచోట్ల ఈ సోదాలు కొనసాగించారు.హైదరాబాద్‌లోని కోకాపేటలో ఉన్న అవినాష్‌రెడ్డి నివాసంలో కూడా ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. 

కడపలోని పులివెందులలో ఉన్న ఆయన నివాసానికి అధికారులు వెళ్లగా అది తాళం వేసి ఉన్నట్లు సమాచారం. వివేకా హత్య కేసులో కీలకంగా పేర్కొన్న పలువురు నిందితులకు సంబంధించిన ఇళ్ళు ల్లో కూడా సోదాలు నిర్వహించారు.ఈ సోదాల సందర్భంగా అవినాష్‌రెడ్డి నివాసంలో రూ.24 లక్షల నగదు గుర్తించారు. ఆ నగదుకు సంబంధించి సరైన లెక్కలు, వివరాలు వెల్లడించలేదు‌ దీంతో నగదును ఈడీ అధికారులు సీజ్‌ చేశారు.

అదే సమయంలో అవినాష్‌రెడ్డికి సంబంధించిన రెండు లాకర్లను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కేసుకు సంబంధించిన కీలక డాక్యుమెంట్లను కూడా తమ వెంట తీసుకెళ్లారు. అయితే నగదు స్వాధీనం, లాకర్ల వివరాలపై ఈడీ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. వివేకానందరెడ్డి హత్యపై సీబీఐ దర్యాప్తు, దాని ఆధారంగా నమోదైన కేసుకు అనుసంధానంగా మనీలాండరింగ్‌ కోణంలో ఈడీ దర్యాప్తు కొనసాగిస్తోంది. 

ఈ క్రమంలోనే శుక్రవారం హైదరాబాద్‌, కడపల్లో ఈడీ అధికారులు విస్తృతంగా సోదాలు చేపట్టారు. వివేకా 2019 మార్చి 15న పులివెందులలోని తన నివాసంలో హత్యకు గురయ్యారు. ఈ కేసు దర్యాప్తు అనంతరం సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్లు, తదుపరి పరిణామాల ఆధారంగా ఈడీ మనీలాండరింగ్‌ కోణాన్ని పరిశీలిస్తోంది. ఈడీ సోదాల్లో లభించిన నగదు, డాక్యుమెంట్లు, లాకర్లలోని వివరాలు దర్యాప్తులో కీలకంగా మారే అవకాశముంది.

ఈడీ కీలక ప్రకటన చేసింది. హైదరాబాద్, కడపలో మొత్తం 7 ప్రాంతాల్లో కీలక నిందితుల నివాసాలు, ఇతర అనుబంధ ప్రాంతాల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద ఈ తనిఖీలు చేపట్టినట్లు ఈడీ వెల్లడించింది. 2019 మార్చి 15న పులివెందులలోని తన నివాసంలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు గురయ్యారు. ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేసి మూడు ఛార్జ్‌షీట్లు దాఖలు చేసింది. అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, శివశంకర్ రెడ్డి సహా పలువురిని నిందితులుగా ఛార్జ్‌షీట్లలో పేర్కొంది.

హత్య కుట్రలో రూ.40 కోట్ల డీల్ జరిగినట్లు దస్తగిరి తన వాంగ్మూలంలో పేర్కొన్నట్లు సీబీఐ దర్యాప్తులో వెల్లడైంది. హత్యలో భాగంగా దస్తగిరిని రూ.5 కోట్లతో ప్రలోభపెట్టినట్లు కూడా దర్యాప్తులో తేలినట్లు ఈడీ తెలిపింది. అలాగే సునీల్ యాదవ్ నుంచి రూ.1 కోటి అందుకున్నట్లు గంగిరెడ్డి అంగీకరించినట్లు పేర్కొంది.
గతంలో సయ్యద్ మున్నా లాకర్‌లో రూ.46.70 లక్షల నగదు, లెక్కల్లో చూపని ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ తెలిపింది. సీబీఐ ఎఫ్‌ఐఆర్, ఛార్జ్‌షీట్ల ఆధారంగా ఈడీ PMLA కేసు నమోదు చేసింది.

తాజా సోదాల్లో కీలక నేరపూరిత పత్రాలు, డిజిటల్ పరికరాలను స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ వెల్లడించింది. అవినాష్ రెడ్డికి సంబంధించిన నివాసంలో లెక్కల్లో చూపని రూ.24 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. రెండు లాకర్ తాళాలను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సోదాల్లో లభించిన డిజిటల్, ఆర్థిక ఆధారాలను విశ్లేషిస్తూ దర్యాప్తును కొనసాగిస్తున్నట్లు ఈడీ పేర్కొంది.

Viveka murder case, ED, CBI, YS Sunitha, President Draupadi Murmu, Money laundering, YS Jagan, YS Avanish reddy, PMLA,  Avinash Reddy, Bhaskar Reddy, Sivashankar Reddy

google-ad-img
    Related Sigment News
    • Loading...