Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...వివేకా హత్య కేసులో 13 లక్షల పేజీల కేసు పత్రాలు
posted on: Mar 10, 2026 3:23PM

మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి మంగళవారం సీబీఐ ప్రత్యేక కోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణ సందర్భంగా కేసు దర్యాప్తుకు సంబంధించిన విస్తృతమైన పత్రాలను సీబీఐ అధికారులు కోర్టు ఆదేశాల మేరకు నిందితులకు అందజేశారు. సీబీఐ అధికారులు ఈ కేసులో తమ దర్యాప్తు నివేదికతో పాటు గతంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) సేకరించిన నివేదికలు, కేసుకు సంబంధించిన ఇతర రికార్డులను కూడా నిందితులకు అందజేశారు.
మొత్తం సుమారు 13 లక్షల పేజీలకు పైగా ఉన్న ఫైల్స్‌ను ఇండెక్స్ రూపంలో సిద్ధం చేసి అందజేసినట్లు సీబీఐ అధికారులు వెల్లడించారు. ఇంత భారీ స్థాయిలో ఉన్న కేసు పత్రాలను సాంకేతిక లోపాలు లేకుండా అందజేస్తున్నామని కోర్టుకు వివరించారు. ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో ఈ కేసులో కీలకంగా భావిస్తున్న అర్జున్ రెడ్డి, కిరణ్ యాదవ్‌లను సీబీఐ అధికారులు విచారించారు. ఆ విచారణకు సంబంధించిన పూర్తి నివేదికను కూడా సీబీఐ అధికారులు కోర్టుకు సమర్పిం చారు. ఈ ఇద్దరి విచారణ ద్వారా కేసులోని పలు అంశాలపై మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని దర్యాప్తు వర్గాలు భావిస్తున్నాయి.
ఈ కేసులో నిందితులుగా ఉన్న వారిలో కడప ఎంపీ Y. S. అవినాష్ రెడ్డి మినహా మిగతా నిందితులంతా కోర్టు ముందు హాజరయ్యారు. కేసుకు సంబంధించిన పత్రాలు భారీ స్థాయిలో ఉండటంతో వాటిని పరిశీలించడానికి కొంత సమయం కావాలని నిందితుల తరఫు న్యాయవాదులు కోర్టును కోరారు. ఇరువైపులా వాదనలు విన్న కోర్టు కేసు పత్రాల పరిశీలనకు సమ యం ఇస్తూ తదుపరి విచారణను ఈ నెల 16వ తేదీకి వాయిదా వేసింది. మరోవైపు, రాష్ట్ర రాజకీయాల్లో కూడా సంచలనం సృష్టించిన ఈ హత్య కేసు విచారణలో ప్రతి దశలో కొత్త పరిణామాలు చోటుచేసుకుం టుండటంతో కేసు తీర్పు పై రాజకీయ వర్గాలు, ప్రజల్లో ఆసక్తి నెలకొంది. భారీ సంఖ్యలో సేకరించిన సాక్ష్యాలు, పత్రాలు విచారణలో కీలక పాత్ర పోషించే అవకాశముందని న్యాయ వర్గాలు అభిప్రాయపడుతున్నారు.


.webp)



