Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...త్వరలో విశాఖ రైల్లేజోన్ కార్యకలాపాలు.. లోక్ సభ వేదికగా వెల్లడించిన అశ్వినీ వైష్ణవ్
posted on: Mar 19, 2026 11:01AM

ఏపీ ప్రజల కల సాకారమయ్యేలా విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే (ఎస్సీఓఆర్) జోన్ కార్యకలాపాలు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ పార్లమెంటు సాక్షిగా కీలక వివరాలను వెల్లడించారు. లోక్‌సభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. జోన్ ఏర్పాటు ప్రక్రియ తుది దశకు చేరుకుందని తెలిపారు. అలాగే పాలనా పరమైన ఏర్పాట్లూ వేగంతా సాగుతున్నాయని బదులిచ్చారు. ఎస్సీఓఆర్ జోన్ కార్యకలాపాలను తక్షణమే మొదలుపెట్టేందుకు వీలుగా విశాఖపట్నంలోని వీఎంఆర్డీఏ భవనమైన ది డెక్ ను తాత్కాలిక కార్యాలయంగా సిద్ధం చేసినట్లు చెప్పారు.
ప్రధాన కార్యాలయ భవన నిర్మాణానికి సంబంధించి పునాది పనులు ఇప్పటికే పూర్తయ్యాయనీ.. , శాశ్వత భవన నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం రూ.106.89 కోట్లు మంజూరు చేసిందన్న ఆయన ముడసరలోవ వద్ద ఏపీ ప్రభుత్వం కేటాయించిన 52.2 ఎకరాల భూమిని ఇప్పటికే రైల్వే శాఖ స్వాధీనం చేసుకుందని వివరించారు.
ఇకపోతే ఎస్సీఓఆర్ జోన్ జనరల్ మేనేజర్ సహా ఉన్నతాధికారుల నియామక ప్రక్రియ ఇంచుమించుగా పూర్తయ్యిందని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ లోక్ సభ వేదికగా వెల్లడించారు. ఎస్పీఓఆర్ జోన్ పరిధిలోకి విజయవాడ, గుంటూరు, గుంతకల్ డివిజన్లతో పాటు విశాఖపట్నం డివిజన్ లోని కొంత భాగం వస్తుంది.
ఏపీలో రైల్వే మౌలిక సదుపాయాల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామని చెప్పిన అశ్వినీ వైష్ణవ్ రాష్ట్రంలో ప్రస్తుతం రూ.70,232 కోట్ల విలువైన 39 రైల్వే ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయన్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఏపీకి రికార్డు స్థాయిలో రూ.9,417 కోట్లు కేటాయించామనీ, అలాగే ఎర్రుపాలెం- అమరావతి-నంబూరు రైల్వే లైన్ నిర్మాణానికి రూ.2,047 కోట్లు మంజూరు చేసినట్లు చెప్పారు.



.webp)


