కన్న కొడుకును హతమార్చిన తండ్రి
posted on Nov 11, 2025 2:10PM
.webp)
దురలవాట్లకు బానిసలయిన పిల్లలను భరించే స్థితి ని తల్లిదండ్రులు కోల్పోతున్నారు డ్రగ్స్ మద్యం యువతరం జీవితాలను నాశనం చేస్తుంది. అదే సమయంలో తల్లిదండ్రులను ఆర్థికంగా ఇబ్బందులకి గురి చేస్తోంది దీంతో తల్లిదండ్రులు క్షణికావేశంలో కన్నా కొడుకులను కడతేర్చడానికి వెనుకాడడం లేదు. అలా విశాఖలో మద్యానికి బానిసైన కొడుకు వై ప్రసాద్ (36)ను తండ్రి లక్ష్మణరావు(60) హతమార్చాడు.
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. మద్యానికి డబ్బులు కావాలని వేధించడంతో ఈనెల ఆరవ తేదీన మధ్యాహ్నం సుమారు మూడున్నర గంటల ప్రాంతంలో కొడుకు ప్రసాదును కర్రతో బలంగా తలపై కొట్టడంతో మృతి చెందాడు. అనంతరం మృతదేహాన్ని ఆ మరుసటి రోజు జోడిగుడ్లపాలెం స్మశాన వాటికలో పూడిచిపెట్టాడు. మృతుడు ప్రసాదు కు 2019లో వివాహం కాగా ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబ కలహాలతో భార్య వై.రాజీ విజయవాడలో నివసిస్తున్నారు. విషయం భార్య రాజీకి తెలియడంతో ఆమె ఫిర్యాదు మేరకు ఆరి లోవ పోలీసులు దర్యాప్తు చేయగా నిందితుడు కన్న తండ్రి లక్ష్మణరావు గా నిర్ధారించారు.