కాళేశ్వరం...కూలేశ్వరం అయింది : సీఎం రేవంత్

posted on: Feb 7, 2026 5:33PM

 

మాజీ సీఎం కేసీఆర్ నిర్లక్ష్యానికి రంగారెడ్డి జిల్లా బలైందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. మూడేళ్లలోనే కాళేశ్వరం కూలేశ్వరం అయిందని ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. వికారాబాద్‌ జిల్లా పరిగిలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో సీఎం మాట్లాడారు.  మున్సిపల్ ఎన్నికల్లో ప్రధాని మోదీని చూసి ఓటు వేయమని బీజేపీ నేతలు అడుగుతున్నారు..మోదీని చూసి ఓటు వేస్తే గల్లీలో ఉండే నాయకుడు పనిచేయకపోతే అడగలమా? సీఎం ప్రశ్నించారు. చీకటి ఒప్పందాలు, ఫెవికాల్ బంధంతో కాంగ్రెస్ ను ఓడించే కుట్రలు చేస్తున్నారని రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఫోన్ ట్యాపింగ్ చేస్తే నోటీసు ఇవ్వకపోతే ఏం చేస్తారని రేవంత్  అన్నారు. తెలంగాణ జాతిపితకు నోటీసులు ఇచ్చామని కొందరు అంటున్నారు...తప్పు చేస్తే బేడీలు వేసి లాక్కొచ్చే అవకాశం ఉందని ముఖ్యమంత్రి అన్నారు. తెలంగాణ పోలీసులు మంచివాళ్లు కాబట్టి పద్దతిగా కేసీఆర్ ఇంటికి వెళ్లి వాంగ్మూలం తీసుకున్నారని రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ మనోడు కాదని, పరాయి వాడని సీఎం అన్నారు. మాజీ సీఎం పక్క రాష్ట్రం గురించే ఆలోచిస్తారని తెలిపారు. మాజీ మంత్రి రోజా పెట్టిన చేపల పులుసు తిని రాయలసీమను రతనాల సీమ చేస్తామని కేసీఆర్ అన్నారని రేవంత్ తెలిపారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...