ఇంద్రకీలాద్రిపై వైభవంగా మహాశివరాత్రి ఉత్సవాలు
posted on: Feb 15, 2026 1:39PM

విజయవాడ ఇంద్రకీలాద్రిపై మహాశివరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో భక్తుల సౌకర్యార్థం ఈఓ వి.కె. సీనా నాయక్ ఆధ్వర్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేశారు
పుష్ప అలంకరణ : శివాలయం మరియు అమ్మవారి ఆలయ ప్రాంగణాలు రంగురంగుల పుష్పాలుతో శోభాయమానంగా అలంకరించబడ్డాయి. ఈ అలంకరణ ఉత్సవాల్లో ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది.క్యూ లైన్ల నిర్వహణ : శివరాత్రి రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం దర్శనం కోసం భక్తులు ఎటువంటి ఇబ్బంది పడకుండా క్యూ లైన్లు సాఫీగా సాగుతున్నాయి.
ప్రత్యేక ఏర్పాట్లు : ఈఓ సీనా నాయక్ ముందుస్తుగా సమీక్షా సమావేశాలు నిర్వహించి, ఇంజనీరింగ్ మరియు ఇతర విభాగాల సమన్వయంతో ఆలయ ప్రాంగణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. అలంకరణ: గంగా పార్వతీ సమేత మల్లేశ్వర స్వామివార్లను వధూవరులుగా అలంకరించి ఉత్సవాలు ప్రారంభించారు.
ప్రధాన పూజలు : లింగోద్భవ కాలంలో మహాన్యాస పూర్వక రుద్రాభిషేకాలు, త్రికాల అభిషేకాలు మరియు కళ్యాణోత్సవం వైభవంగా జరగనున్నాయి.



.webp)


