విజ‌య్ కాంత్ ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థిగా వైదొలుగుతారా?

posted on: Apr 5, 2016 4:59PM

 

త‌మిళ‌నాడు శాస‌న‌స‌భ‌కు త్వ‌ర‌లో జ‌ర‌గనున్నఎన్నిక‌ల్లో హాట్ ఫేవ‌రేట్ , కింగ్ మేక‌ర్ గా భావిస్తున్న కెప్టెన్ విజ‌య్ కాంత్ కు పొలిటిక‌ల్ క‌ష్టాలు స్టార్ట‌య్యాయి. డీఎంకే, అన్నాడీఎంకేల‌కు స‌పోర్ట్ ఇస్తానంటూ ఊరించి, ఊరించి చివ‌రికి ఎండీఎంకే, వీసీకే, సీపీఎం, సీపీఐల‌తో కూడిన పీడ‌బ్ల్యూఎఫ్ కూట‌మికి మ‌ద్థ‌తిస్తున్న‌ట్టు ప్ర‌క‌టించి అంద‌రికి షాకిచ్చారు విజయ్ కాంత్. త‌ను అనుకున్న ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థిత్వాన్ని సాధించారు.

 

అయితే ఇదంతా బాగున్న‌ప్ప‌టికి విజ‌య్ కాంత్ నిర్ణ‌యాన్నిడీఎండీకేలోని సీనియ‌ర్లు కొంద‌రు వ్య‌తిరేకిస్తున్నారు. తొలుత ఈ నిర్ణ‌యాన్నిస్వాగ‌తించిన ఎగ్జిట్ పోల్స్ రిజ‌ల్ట్స్ వ‌చ్చిన త‌ర్వాత చాలా మంది త‌మ నిర‌స‌న‌ను తెలియ‌జేశారు. జ‌య‌ల‌లిత‌కు మ‌ద్ద‌తిచ్చుంటే బాగుండేద‌ని వారు బాహాటంగానే విమ‌ర్శిస్తున్నారు. మ‌రి ఇన్ని వ్య‌తిరేక‌త‌లు, సర్వేలను దృష్టిలో పెట్టుకుని కెప్టెన్ మ‌ద్థ‌తు విష‌యంలో పున‌రాలోచిస్తారా లేక రాక రాక వ‌చ్చిన ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థిత్వాన్ని వ‌దులుకుంటారా అనేది వేచి చూడాలి.

google-ad-img
    Related Sigment News
    • Loading...