వీరి కాంబోలో మరో అద్భుతమైన సీన్..బీ రెడీ..

 

త్వరలో మరో అద్భుతమైన సీన్ చూసే అదృష్టానికి ఏపీ ప్రజలు నోచుకున్నారు. ఇంతకీ ఆ సీన్ ఏంటనుకుంటున్నారా...? ప్రధాని నరేంద్ర మోడీ, విజయసాయిరెడ్డిలు మరోసారి ఓ అద్భుతమైన సీన్ చూపించబోతున్నారు. ఇప్పటికే భూమి సూర్యని చుట్టూ తిరుతునట్టు.. తన కేసుల నేపథ్యంలో రెడ్డిగారు మోడీ చుట్టూ ప్రదిక్షణలు చేస్తూనే ఉన్నారు. ఆయన అపాయింట్ మెంట్ తీసుకుంటారు. అవసరమైతే ఆయన కోసం వెయిట్ చేస్తారు. ఇంకా అవసరమైతే కాళ్ల మీద పడతారు. ఇక ఈ విషయం వార్తల్లో రావటం..దీని గురించి ఏదైనా మాట్లాడితే.. నా ఇష్టం నేను కలుస్తా.. ఎన్నిసార్లైనా కలుస్తా.. మీ కెందుకు అని నోటికి వచ్చినట్టు మాట్లాడతాడు. అంతేనా అక్కడితో ఆగడు.. ముఖ్యమంత్రి అని కూడా చూడకుండా...బూతు పురాణం ఎత్తుకుంటాడు. దీంతో ఎంత కవర్ చేసిన విజయసాయిరెడ్డి ఆలోచన ఏంటనేది అందరికీ అర్ధమయింది.

 

ఇదిలా ఉండగా ఇప్పుడు మరో ఆసక్తికరమైన వార్త ఒకటి బయటకు వచ్చింది. అదేంటంటే...విజయసాయి రెడ్డిగారు "వెంకటేశ్వర వైభవం" అనే పుస్తకం రాశారంట. అయితే ఈ పుస్తక ఆవిష్కరణ మోడీతో చేయించనున్నారట. ఈ విషయం మోడీ దగ్గర ప్రస్తావించి.. ఆయన్ని టైం అడిగితే.. మోడీ గారు కూడా ఓకే అన్నారట. దీంతో తిరుపతిలో వెంకన్న సాక్షిగా ఈ పుస్తకాన్ని ఆవిష్కరిస్తారట. ఇక ఈ వార్తలు బయటకు రావడంతో అప్పుడే చర్చలు, కామెంట్లు మొదలయ్యాయి. విజయసాయి రెడ్డి... మళ్ళీ మోడీ కాళ్ళ పై పడే సీన్ ఈ రాష్ట్ర ప్రజలు మరోసారి చూడనున్నారని అంటుండగా... తిరుపతిలో వెంకన్న సాక్షిగా ఇచ్చిన హామీలు మన ప్రధానికి కనపడవు కాని.. అదే వెంకన్న పాదాల సాక్షిగా A2 రాసిన పుస్తకం మాత్రం విడుదల చేస్తారంట... అని అనుకుంటున్నారు.

 

మరి ఒకపక్క ఏపీకి ప్రత్యేక హోదా కావాలంటూ.. ఏపీ ప్రజలంతా పోరాటం చేస్తుంటే... మోడీ మనకు అన్యాయం చేస్తున్నారని జనం ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే.. మరోపక్క విజయసాయి రెడ్డి మాత్రం, మోడీ కాళ్ళకు మొక్కి, ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని ఈ విధంగా తాకట్టుపెడుతున్నారు. ఇక ముఖ్యమంత్రిగారికి అపాయింట్ మెంట్ ఇచ్చే తీరిక మన ప్రధాని గారికి లేదు కానీ.. ఢిల్లీ నుండి ఇక్కడికి వచ్చి.. పుస్తకాన్ని ఆవిష్కరించడానికి మాత్రం టైం దొరుకుతుంది. ఈ విషయం ఎలాగూ అందరికీ తెలిసిపోయింది కదా అని అనుకుంటున్నట్టున్నారు...అందుకే డైరెక్ట్ గానే ఈ సీన్ చూపించడానికి రెడీఅవుతున్నారు. మరి 16 నెలలు జైలుకి వెళ్లి వచ్చి, బెయిల్ పై బయట తిరుగుతున్న వ్యక్తిని, మోడీనే ప్రోత్సహిస్తున్నాడు అంటే, ఇంకా ఏమి చెప్పాలి ?