Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...విజయ డెయిరీ చైర్మన్ పదవికి చలసాని రాజీనామా.. తెలుగుదేశంలో అసలేం జరుగుతోంది?
posted on: Aug 8, 2026 9:59AM

తెలుగుదేశం పార్టీలో ఏం జరుగుతోంది. పార్టీ వ్యవహారాలపై చంద్రబాబు దృష్టి పెట్టడం లేదా? కొందరు పార్టీ విషయాలు చంద్రబాబు వరకూ చేరకుండా చక్రం తిప్పుతున్నారా అన్న అనుమానాలు వెల్లువెత్తున్నాయి. విజయా డెయిరీ ఎన్నికల్లో చోటు చేసుకున్న పరిణామాలు తెలుగుదేశం పార్టీలో సంచలనానికి కారణమయ్యాయి. ఈ పరిణామాల పట్ల పార్టీ శ్రేణుల్లోనూ తీవ్ర అసంతృప్తి, అసహనం వ్యక్తం అవుతోంది. విషయమేంటంటే.. విజయా డెయిరీ ఎన్నికలలో చైర్మన్‌గా చలసాని ఆంజనేయులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే ఆ ఎన్నిక జరిగిన గంటల వ్యవధిలోనే ఆయనపై రాజీనామా చేయాలంటూ తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు ప్రారంభమయ్యాయి. ఈ ఉదంతం తెలుగుదేశం పార్టీలోనూ, పాడి రైతుల్లోనూ కూడా హాట్ టాపిక్ గా మారింది.
తాజాగా జరిగిన ఎన్నికలలో మొత్తం 15 మంది డైరెక్టర్లలో ఖాళీ అయిన మూడు స్థానాలకు చలసాని ఆంజనేయులు, పల్లాగాని రాంబాబు, గొంది నరేంద్ర ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆ వెంటనే నిర్వహించిన చైర్మన్ ఎన్నికలో డైరెక్టర్లందరూ కలిసి చలసాని ఆంజనేయులను విజయ డెయిరీ చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ మేరకు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు.
అయితే.. ఎన్నిక ముగిసిన వెంటనే నాటకీయ పరిణామాలు మొదలయ్యాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన మంత్రులు కొల్లు రవీంద్ర, కొలుసు పార్థసారథి చలసాని ఆంజనేయులతో భేటీ అయి చైర్మన్ పదవికి రాజీనామా చేయాలని అధిష్టానం ఆదేశించినట్లు తెలిపారు. పార్టీయా, చైర్మన్ పదవా తేల్చుకోవాలంటూ అల్టిమేటమ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ పరిణామంలో మనస్తాపానికి గురైన చలసాని ఆంజనేయులు అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరారు.
అసలు ఆయనను రాజీనామా చేయాలంటూ తెలుగుదేశం హైకమాండ్ ఒత్తిడి తీసుకురావడానికి గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు సహా పలువురు తెలుగుదేశం నేతలు చలసాని ఎన్నికను వ్యతిరేకించడమేనంటున్నారు. విజయాడెయిరీ చైర్మన్ గా ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించిన వెంటనే.. ఆయనపై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టే విధంగా ఎమ్మెల్యే ఆయన వర్గీయులు చేసిన ప్రయత్నాలను మెజారిటీ డైరక్టర్లు వ్యతిరేకించి.. ఏకగ్రీవంగా ఎన్నుకున్నరోజు నో కాన్ఫిడెన్స్ మోషన్ ఎమిటని నిలదీసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే.. పార్టీ హైకమాండ్ చలసాని రాజీనామాకు ఒత్తిడి చేయడం పార్టీలో సంచలనంగా మారింది.
దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీలో క్రియాశీలంగా పనిచేస్తున్న సీనియర్ నేత చలసానికి సొంత పార్టీ నుంచే ఈ స్థాయి ఒత్తిడి రావడం వెనుక కృష్ణా జిల్లా పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలే కారణమని పరిశీలకులు అంటున్నారు. ఎన్టీఆర్ తెచ్చిన మాక్స్ చట్టం కింద స్వతంత్రంగా నడుస్తున్న ఈ డెయిరీలో ప్రభుత్వ జోక్యానికి తావు లేకపోయినా. . చలసానిపై ఈ స్థాయిలో రాజీనామాకు ఒత్తడి రావడం పట్ల పాడి రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
1200 కోట్ల రూపాయల టర్నోవర్‌తో పాడి రైతులకు ఏటా మూడుసార్లు బోనస్ ఇస్తూ లాభాల్లో నడుస్తున్న విజయ డెయిరీలో రాజకీయ వివాదాలు సంస్థ భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావం చూపుతాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ వ్యవహారంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తక్షణమే జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ప్రజాస్వామ్యంగా బద్ధంగా ఎన్నుకున్న చైర్మన్ ను ఒక్క రోజులోనే రాజానామాకు ఒత్తిడి రావడం కలకలం రేపుతోంది. ఈ వ్యవహారం తెలుగుదేశం వర్గీయులలోనే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మూడు దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీలో క్రియాశీలంగా వ్యవహరిస్తున్న నేతకు ఈ స్థాయిలో అవమానాలు ఎదురౌతుండటంతో ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలిసే ఇదంతా జరుగుతున్నాయా అన్న అనుమానాలు పార్టీ నేతలు, శ్రేణుల్లోనే వ్యక్తం అవుతున్నాయి.
అదలా ఉంటే.. ఈ పరిస్థితుల్లోనూ చలసాని పార్టీ హైకమాండ్ ఆదేశాలకు కట్టుబడి తన పదవికి రాజీనామా చేయడం.. పార్టీ పట్ల ఆయనకు ఉన్న నిబద్ధతకు అద్దంపడుతోందని అంటున్నారు. పార్టీ అధిష్ఠానం ఆదేశాలను శిరసావహిస్తూ తాను విజయడెయిరీ న ఛైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన చలసాని పదవుల కంటే పార్టీ ప్రయోజనాలు, క్రమశిక్షణ, పార్టీ నాయకత్వ ఆదేశాలను అమలు చేయడమే తనకు ముఖ్యమని చలసాని ఈ సందర్భంగా పేర్కొన్నారు. మొత్తంగా ఈ వ్యవహారం తెలుగుదేశం శ్రేణులకే పార్టీ నాయకత్వం తీరుపట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తమయ్యేలా చేసిందని పరిశీలకులు అంటున్నారు.
Vijaya Dairy Chairman Election, Chalasani Anjaneyulu, Krishna Milk Union, Yarlagadda Venkata Rao, Kollu Ravindra Kolusu Parthasarathy, halasani Resigb



.webp)


