Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...2031 ఎన్నికల్లో తమిళనాట విజయ్ వర్సెస్ అన్నామలై?.. సాధ్యమేనా?
posted on: Jun 3, 2026 11:10AM

తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి. ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నేతృత్వంలోని తమిళ వెట్రిగ కజగం (టీవీకే) రెండు దశాబ్దాలుగా తిరుగులేని శక్తిగా ఉన్న ద్రావిడ పార్టీలను చిత్తు చేసి ఏకంగా అధికార పీఠాన్ని దక్కించుకుంది. ముఖ్యమంత్రిగా విజయ్ బాధ్యతలు చేపట్టడంతో తమిళ రాజకీయ చిత్రం పూర్తిగా మారిపోయింది. అక్కడ జరుగుతున్న ప్రతి చిన్న రాజకీయ పరిణామం దేశ వ్యాప్తంగా ఆసక్తికర చర్చకు తెరలేపుతోంది. తాజాగా అప్పు డే రాబోయే 2031 అసెంబ్లీ ఎన్నికల సమీకరణాలపై పరిశీలకులు విశ్లేషణలు చేస్తున్నారు. ఐదేళ్ల తర్వాత తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు విజయ్ వర్సెస్ అన్నామలై గా మారతాయంటూ విశ్లేషకులు పెద్ద చర్చకు తెరలేపారు.
అయితే వాదనలు, చర్చ, క్షేత్రస్థాయిలో ఎంతవరకు కార్యరూపం దాలుస్తాయనే దానిపై రాజకీయ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. నూతన సీఎం విజయ్ ఎన్నికలకు సరిగ్గా రెండేళ్ల ముందుగానే తన రాజకీయ పార్టీని ప్రకటించి ఎంతో వ్యూహాత్మకంగా అడుగులు వేశారు. కేవలం ప్రకటనకే పరిమితం కాకుండా.. ఆరెండేళ్లూ.. నిరంతరం ప్రజల్లోనే తిరుగుతూ వారి సమస్యలను తెలుసుకున్నారు. దశాబ్దాలుగా కోలీవుడ్ లో సంపాదించుకున్న తన స్టార్ డమ్ ను, ఫ్యాన్ ఫాలోయింగ్ ను ఓటు బ్యాంకుగా మార్చుకోవడంలో విజయ్ సఫలమయ్యారు. వీటన్నింటికీ తోడు తమిళనాట కరుణానిధి, జయలలిత వంటి దిగ్గజ నేతల మరణాల తర్వాత ఏర్పడిన రాజకీయ శూన్యం విజయ్ కు అనుకూలంగా మారింది.
మరోవైపు బీజేపీ తమిళనాడు మాజీ అధ్యక్షుడు అన్నామలై ప్రస్థానాన్ని పరిశీలిస్తే ఆయన భవిష్యత్తు రాజకీయ చిత్రంపై ఇప్పటికీ స్పష్టత కొరవడింది. ఒకప్పుడు కర్ణాటక క్యాడర్ లో సమర్థుడైన ఐపీఎస్ అధికారిగా సేవలందించిన అన్నామలై.. తన సివిల్ సర్వెంట్ పదవికి రాజీనామా చేసి మరీ రాజకీయాల్లోకి ప్రవేశించారు. కమలం పార్టీలో చేరిన వెంటనే తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి ఎన్నో దూకుడు నిర్ణయాలతో ఆకట్టుకున్నారు. గతంలో డిఎంకె ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన ఒక నిరసనలో బహిరంగంగా తనను తాను కొరడాతో కొట్టుకుని దేశవ్యాప్తంగా అందరి దృష్టి ఆకర్షించారు. అయితే ప్రస్తుతం ఆయన బీజేపీని వీడడంతో ఆయన రాజకీయ పయనం ఎటు వైపు అన్నది ప్రశ్నార్థకంగా మారింది.
ఒకవేళ అన్నామలై సొంతంగా ముందుకు సాగినా విజయ్ స్థాయిలో ప్రజాదరణను, ఓట్లను సాధించడం దాదాపు అసాధ్యమనే వాదన బలంగా వినిపిస్తోంది. ఇప్పటికే ఒక జాతీయ పార్టీలో పనిచేసి, దానిని వీడి తన రాజకీయ అపరిపక్వతను ఆయనంతట ఆయనే స్వయంగా బయటపెట్టుకున్నారంటూ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యమంత్రి విజయ్ వెనుక కోట్లాది మంది అభిమానులు, బలమైన కేడర్ ఉండి ఓట్లు వేసి గెలిపించారు. కానీ.. అన్నామలైకి ఆ స్థాయిలో ఓట్లు వేసి గెలిపించే ఓటు బ్యాంక్ లేదని అంటున్నారు.






