Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...మోదీగారూ ఆదుకోండి- కింగ్‌ఫిషర్ ఉద్యోగులు!
posted on: Mar 9, 2016 3:03PM

వేలకోట్ల రూపాయలు దిగమింగి చల్లగా జారుకోవాలని చూస్తున్న విజయ్‌మాల్యాకు మరో చుక్కెదురైంది. ఇప్పటికే ఆయనకు అప్పులిచ్చిన బ్యాంకులన్నీ మాల్యాను అరెస్టు చేయమంటూ సుప్రీం కోర్టును వేడుకోగా, ఇప్పడు మాల్యా ఉద్యోగులు కూడా ఉద్యమబాట పట్టారు. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ పేరుతో కోట్లకి కోట్లు అప్పు తీసుకున్న మాల్యా తమకు మాత్రం పైసా ఇవ్వలేదని విరుచుకుపడుతున్నారు ఆ సంస్థ ఉద్యోగులు. ప్రస్తుతం కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ మూతపడినప్పటికీ, 2012 నుంచి తమకు రావల్సిన జీతాలు రానేలేదని వాపోతున్నారు.
ఇప్పటికే మాల్యాకు బహిరంగ లేఖలు రాసిన వీరు, ఇప్పడు ముంబైలోని కింగ్‌ఫిషర్ కార్యాలయం ముందు ధర్నాలకు దిగుతున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీనే ఈ విషయంలో చొరవ చూపాలని వీరు కోరుతున్నారు. ప్రభుత్వం కనుక తల్చుకుంటే, మాల్యా మీద చర్యలు తీసుకోవడం పెద్ద కష్టం కాదని వీరు ఆశిస్తున్నారు. గత నాలుగేళ్లుగా కింగ్‌ఫిషర్ విమాన సంస్థ తన ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిల మొత్తం 800 కోట్లకి పైనే ఉంటుందని ఓ అంచనా! ఈపాటికే విజయ్ మాల్యా దేశం విడిచి పారిపోయి ఉంటాడని అనుమానిస్తున్న నేపథ్యంలో, అంత సొమ్ముని మాల్యా నుంచి రాబట్టడం అయ్యే పనేనా అన్నది సామాన్యుడి ప్రశ్న!


.jpeg)
.jpg)


