Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...విజయ్ మాల్యా ముమ్మాటికీ నేరస్తుడే
posted on: Jun 15, 2016 2:41PM
.jpg)
బ్యాంకులకు వేలకోట్ల రూపాయల రుణాలు టోపి పెట్టి..బ్రిటన్‌కు పరారైన ప్రముఖ పారిశ్రామికవేత్త విజయ్‌మాల్యా ముమ్మాటికి నేరస్తుడేనని మరోసారి న్యాయస్థానం ప్రకటించింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ వినతి మేరకు ముంబైలోని ప్రత్యేక మనీల్యాండరింగ్ నేరాల విచారణ కోర్టు మాల్యాను ప్రకటిత నేరస్థుడిగా నిర్దారించింది. ఐడీబీఐ బ్యాంకుకు రూ.900 కోట్లతో పాటు ఎస్‌బీఐ కన్సార్షియంకు 9,000 కోట్లకు పైగా బకాయిలు పడ్డారు మాల్యా. దీంతో ఆయన్ను ఉద్దేశ్యపూర్వక రుణ ఎగవేతదారుడిగా పలు బ్యాంకులు ప్రకటించాయి. తనకు అరెస్ట్ తప్పదని భావించిన మాల్యా ఈ ఏడాది మార్చి 2న గుట్టుచప్పుడు కాకుండా బ్రిటన్‌కు పారిపోయాడు.
ఈ కేసులో సీబీఐ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా రంగంలోకి దిగిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఆయనతో పాటు మరికొందరిపై మనీల్యాండరింగ్ కేసులు నమోదు చేసింది. మాల్యాను ఇండియాకు రప్పించేందుకు చట్టపరంగా చర్యలు చేపట్టింది. పాస్‌పోర్ట్‌ను రద్దు చేయించడంతో పాటు రెడ్ కార్నర్ నోటీసులు ఇవ్వాల్సిందిగా ఇంటర్‌పోల్ సహకారం తీసుకుంది. అయితే ఇంటర్‌పోల్ అందుకు నిరాకరించడంతో ఇతర ప్రత్యామ్నాయ మార్గాలపై ఈడీ దృష్టిసారించింది. ఈ నేపథ్యంలో ప్రత్యేక మనీలాండరింగ్ నేరాల విచారణ కోర్టును ఆశ్రయించింది. మాల్యాపై నాన్‌బెయిలబుల్ వారెంట్‌తో పాటు చెక్‌బౌన్స్ తదితర కేసుల్లో కూడా అనేక అరెస్ట్ వారెంట్లు పెండింగ్‌లో ఉన్నాయని ఈడీ కోర్టు దృష్టికి తీసుకొచ్చింది. ఇదివరకే అరెస్ట్ వారెంట్లు జారీ చేసినప్పటికీ..దానిని ఆ వ్యక్తి పట్టించుకోకపోవడం, పరారైపోవడం, రహస్య ప్రాంతాల్లో దాక్కొవడం వంటి కారణాలతో న్యాయస్థానం మాల్యాను ప్రకటిత నేరస్థుడిగా ప్రకటించడంతో మాల్యాను భారత్‌కు రప్పించే చర్యల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు మరో వీలు చిక్కింది.



.jpg)


