Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...విజయ్‌మాల్యా మీద హైదరాబాదులో అరెస్టు వారెంట్లు
posted on: Mar 15, 2016 5:07PM
.jpg)
విజయ్ మాల్యా ఇలా మన దేశం నుంచి పారిపోయాడో లేదో, అలా ఆయన మీద వారెంట్ల మీద వారెంట్లు జారీ అవుతున్నాయి. తాజాగా హైదరాబాదులోని రాజీవ్‌గాంధి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్వహించే GHIAL సంస్థకు రెండు కోట్ల రూపాయలు ఎగవేసిన కేసులో... విజయ్ మాల్యాకు ఒకటీ రెండూ కాదు, ఏకంగా నాలుగు నాన్-బెయిలబుల్ అరెస్టు వారెంట్లు జారీ అయ్యాయి. అప్పట్లో కింగ్‌ఫిషర్ విమానాలను నడిపినప్పడు, మాల్యాగారు సదరు సొమ్ముని ఎగవేశారట.
ఈ విషయమై మాల్యా కోర్టు తాఖీదులను కూడా లెక్కచేయకపోవడంతో, హైదరాబాదులోని ఎర్రమంజిల్ న్యాయస్థానం ఈ వారెంట్లను జారీ చేసింది. అయితే ఇలాంటి వారెంట్లు తమకేమీ కొత్తకాదంటున్నారు ఆయన తరఫు న్యాయవాదులు. ఇంతకుముందు కూడా మాల్యాగారికి ఇలాంటి వారెంట్లెన్నో వచ్చాయనీ, హైకోర్టుకి వెళ్లి వాటిని తాము రద్దు చేయించామనీ చెప్పుకొచ్చారు. ఈసారి కూడా అదే పద్ధతిలో తాము సదరు వారెంట్లను ఎదుర్కొంటామని అన్నారు. మరి ఈసారి న్యాయస్థానానికి ఏమని చెప్పి వారెంట్లను రద్దు చేయిస్తారో!






