విజయ్‌ మాల్యా అరెస్టుకు రంగం సిద్ధం!

posted on: Mar 3, 2016 11:46AM

 

సామాన్యుడు కడుపు చేత పట్టుకుని రుణం కోసం బ్యాంకుల ముందు నిల్చుంటే, సవాలక్ష ప్రశ్నలు వినిపిస్తాయి. లక్ష రూపాయల రుణం చేతికి వచ్చేసరికి చుక్కలు కనిపిస్తాయి. కానీ అదేంటోగానీ బడాబాబులకి ప్రభుత్వం బ్యాంకులు సైతం చాలా తేలికగా వందల కోట్ల రుణాలను అందచేస్తాయి. అప్పు వద్దనేదాకా వదలకుండా ఇస్తూనే ఉంటాయి. ఆపై ‘అప్పు చెల్లించడం నాకిష్టం లేదు’ అని నిర్మొహమాటంగా చెబితే, తలవంచుకుని సదరు అప్పుని, తిరిగిరాని రుణంగా నమోదు చేసుకుంటాయి. కానీ పరిస్థితులు నిదానంగా మారుతున్నాయి.

 

సాక్షాత్తూ రిజర్వ్‌ బ్యాంక్‌ గవర్నరు రఘురామ్‌ రాజన్ ఇలాంటి అప్పుల మీద ప్రత్యేక దృష్టి కనబరచడంతో, బ్యాంకులు మొండి బకాయిల మీద శ్రద్ధ పెట్టక తప్పడం లేదు. దీనికి తోడు నిన్న సీబీఐ డైరక్టరు అనిల్‌ సిన్హా సైతం ప్రభుత్వ బ్యాంకులకి తలంటు పోయడంతో బ్యాంకులలో చలనం వచ్చినట్లుంది. 17 భారతీయ ప్రభుత్వ బ్యాంకులకు 7,800 కోట్ల రూపాయలకు టోకరా పెట్టి, పెట్టేబేడా సర్దుకుని లండన్ వెళ్లిపోదామనుకుంటున్న విజయ్ మాల్యా మీద చర్య తీసుకునేందుకు బ్యాంకులు సిద్ధపడుతున్నాయి. విజయ్‌ మాల్యా పాస్‌పోర్టును రద్దుచేసి, ఆయనను అరెస్టు చేయవలసిందిగా సదరు బ్యాంకులు బెంగళూరులోని ఓ ధర్మాసనం ముందు ఫిర్యాదు చేశాయి. ఆయన పదవీ విరమణ అవుతున్న సందర్భంగా లభిస్తున్న మొత్తం, తమకే అందచేయాలని సదరు బ్యాంకులు కోరుతున్నాయి.

google-ad-img
    Related Sigment News
    • Loading...