Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...తమిళనాట దళపతి మేజిక్
posted on: May 4, 2026 11:02AM

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ట్రెండ్స్ లో కోలీవుడ్ స్టార్ నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) ఏకైక అత్యధిక స్థానాలు సాధించిన పార్టీగా అవతరించడం సంచలనంగా మారింది. ప్రారంభంలో అధికార డీఎంకే కూటమి పైచేయి సాధించినట్లు కనిపించినా.. తర్వాత సీన్ పూర్తిగా మారిపోయింది. విజయ్ పార్టీ అభ్యర్థులు అనూహ్య రీతిలో దూసుకుపోతున్నారు.
లెక్కింపు ప్రక్రియ తొలుత పోస్టల్ బ్యాలెట్లతో ప్రారంభమైంది. ఇందులో అధికార డీఎంకే కూటమి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు, వృద్ధులు వినియోగించుకున్న ఓట్లు డీఎంకేకే అనుకూలంగా పడ్డాయి. ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ తన సొంత నియోజకవర్గమైన కొలత్తూర్‌లో పోస్టల్ బ్యాలెట్లలో స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరిచి మంచి ఆరంభాన్ని అందుకున్నారు. దీంతో డీఎంకే శ్రేణులు మరోసారి విజయం తమదేనన్న ధీమా వ్యక్తం చేశాయి.
అయితే, అసలైన ఓట్ల వేట ఈవీఎంల లెక్కింపుతో ప్రారంభమైంది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో నమోదైన ఓట్ల లెక్కింపు మొదలైన కొద్దిసేపటికే దళపతి విజయ్ తన ప్రభావాన్ని చూపడం మొదలుపెట్టారు. టీవీకే అభ్యర్థులు పలు కీలక స్థానాల్లో డీఎంకే, అన్నాడీఎంకే అభ్యర్థులను వెనక్కి నెట్టి ముందంజలో ఉన్నారు. ముఖ్యంగా యువ ఓటర్లు, పట్టణ ప్రాంతాల్ ఓటర్లు విజయ్ పార్టీ వైపు మొగ్గు చూపినట్లు స్పష్టమౌతోంది. చెన్నై పరిసర ప్రాంతాలతో పాటు ఉత్తర తమిళనాడులోని పలు నియోజకవర్గాల్లో టీవీకే అభ్యర్థులు స్పష్టమైన ఆధిక్యత కనబరిచారు. పెరంబూర్ వంటి కీలక స్థానాల్లో టీవీకే ముందంజలో ఉంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు భిన్నంగా విజయ్ పార్టీ ఇలా దూసుకుపోవడం రాజకీయ పరిశీలకులను సైతం విస్మయానికి గురిచేసింది.
తమిళనాడు రాజకీయాల్లో దశాబ్దాలుగా సాగుతున్న ద్రవిడ పార్టీల ఆధిపత్యానికి విజయ్ రూపంలో బలమైన గండి పడినట్లు కనిపిస్తోంది. కేవలం సినిమా ఫాలోయింగ్‌తోనే కాకుండా.. పక్కా రాజకీయ వ్యూహంతో ప్రజల్లోకి వెళ్లడం విజయ్‌కు కలిసి వచ్చినట్లు కనిపిస్తోంది.
రాష్ట్రవ్యాప్తంగా విజయ్ అభిమానులు, టీవీకే కార్యకర్తలు సంబరాలు మొదలుపెట్టారు. పోస్టల్ ఓట్లలో వెనుకబడినప్పటికీ, అసలైన ప్రజాభిప్రాయం ఈవీఎంల ద్వారా వెల్లడవుతుండటంతో పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. డీఎంకే రెండోసారి అధికారం దక్కించుకోవాలని చూస్తుంటే, విజయ్ తన మార్క్ చూపిస్తూ కింగ్ మేకర్‌గా కాకుండా కింగ్ గానే మారారని ఫలితాలను బట్టి తేలుతోంది.


.webp)



