Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...టీజీ 20 లీగ్ బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్ దేవరకొండ
posted on: Jun 16, 2026 6:58PM
.webp)
తెలంగాణలో హెచ్‌సీఏ ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న టీజీ 20 లీగ్ ఈ నెల 21 నుంచి ప్రారంభం కానుంది. నటుడు విజయ్ దేవరకొండ ఈ టోర్నీకి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నారు. టైటిల్ స్పాన్సర్‌గా శ్రీనిథి యూనివర్సిటీ ఎంపికైంది. లీగ్ ఆరంభానికి సమయం దగ్గర పడుతుండటంతో అభిమానులను ఆకర్షించడానికి హెచ్‌సీఏ, ప్రాంచైజీ యాజమాన్యాలులు ప్రచార కార్యక్రమాలు ముమ్మరం చేశాయి. బుధవారం (జూన్ 17) ట్యాంక్‌బండ్‌పై ట్రోఫీ ఆవిష్కరించనున్నారు.
ఇటీవల నెక్లెస్ రోడ్‌లో హెచ్‌సీఏ ఏర్పాటు చేసిన డ్రోన్ డిస్‌ప్లే షోలో జట్ల లోగోలను నిర్వాహకులు ప్రదర్శించారు. 8 జట్లు తలపడనున్న టోర్నీలో టికెట్ ధరలు రూ.50, రూ.100గా నిర్ణయించారు. విజేతగా నిలిచిన జట్టుకు రూ. కోటి, రన్నరప్ జట్టుకు రూ.50 లక్షల నగదు బహుమతి ఇవ్వనున్నారు. 3, 4 స్థానాల్లో నిలిచిన జట్లకు రూ.25 లక్షల ప్రైజ్ మనీ ప్రకటించారు. ఉప్పల్ స్టేడియంలో తొలి మ్యాచ్‌కు ముందు జరిగే వేడుకల్లో సంగీత దర్శకుడు తమన్ మ్యూజిక్ కాన్సర్ట్, లేజర్ షో ఉంటాయి.


.webp)
.webp)


