పెళ్లిలో రాజుల కాలం నాటి ఆభరణాలు ధరించిన విజయ్, రష్మిక

posted on: Feb 27, 2026 3:39PM

తమ పెళ్లి వేడుకలో  పాన్ ఇండియా స్టార్స్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంట ధరించిన ఆభరణాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ జంట ధరించిన ఆభరణాలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల పెళ్లి గురువారం (ఫిబ్రవరి 26) ఉదయ్‌పూర్‌లో అత్యంత ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే.  

ఉదయ్‌పూర్‌‌లోని ఐటీసీ మెమెంటోస్‌లో చాలా తక్కువ మంది కుటుంబసభ్యులు, బంధు మిత్రుల మధ్య ఈ పెళ్లి వేడుక జరిగింది. రష్మిక, విజయ్ ధరించిన పెళ్లి ఆభరణాలను హైదరాబాద్‌కు చెందిన ‘శ్రీ జ్యువెలర్స్’ తయారు చేసింది. పది నెలల ముందు నుంచే ఆభరణాల తయారీ పనులు మొదలయ్యాయి. ఆభరణాల కోసం కిలోల కొద్దీ బంగారం వాడినట్లు శ్రీ జ్యువెలర్స్ మేనేజింగ్ డైరెక్టర్స్ అభిషేక్ అగర్వాల్, కౌశిక్ కుమార్ తెలిపారు.

రష్మిక, విజయ్‌లు ట్రెండ్‌ను ఫాలో అవ్వలేదు. పాత దనాన్ని కోరుకున్నారు. జంట కోరిక మేరకు శ్రీ జ్యువెలర్స్ వధూవరుల పెళ్లి ఆభరణాలను భారతీయ సంప్రదాయం ఉట్టిపడేలా తయారు చేసింది. మరీ ముఖ్యంగా రాజుల కాలం నాటి డిజైన్స్‌లో ఆభరణాలను తయారు చేసింది.

google-ad-img
    Related Sigment News
    • Loading...