Latest News

కావలిలో విజిలెన్స్ దాడులు..భారీగా రేషన్ బియ్యం పట్టివేత

posted on: Mar 16, 2026 10:23AM

నెల్లూరు జిల్లా కావలిలో రేషన్ బియ్యం అక్రమరవాణా గుట్టు రట్టైంది. కావలి పట్టణంలోని తోమాటి వారి వీధిలో ఓ వ్యక్తి ఇంట్లో భారీగా నిలవ ఉంచిన రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. విశ్వసనీయంగా అందిన సమాచారం మేరకు కావలి పట్టణంలోని పట్టణంలోని జెండా చెట్టు సెంటర్ సమీపంలో  గౌస్ బాషా అనే వ్యక్తికి చెందిన ఇంట్లో విజిలెన్స్ అధికారులు సోదాలు నిర్వహించారు.

ఈ సోదాలలో దాదాపు 151 బస్తాల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.  నిందితుడిని  అదుపులోకి తీసుకుని కావలి వన్ టౌన్ పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇలా ఉండగా కేవలం రెండు నెలల వ్యవధిలోనే కావలిలో దాదాపు వెయ్యి బస్తాల రేషన్ బియ్యం పట్టుబడటం కలకలం రేపుతోంది.  

google-ad-img
    Related Sigment News
    • Loading...