అక్కా రజనక్కా...నీ కష్టం ఊరకే పోదు!
posted on: Feb 6, 2026 9:09PM

ఏంటీ కామెంట్ కి అర్ధం? అని చూస్తే.. రాంబాబు గుంటూరు ఇష్యూలో గల్లా మాధవి ఎంత ఫేమస్ అయ్యారో అంతకన్నా మించి ఫేమస్ కావాలనుకున్న రజనక్క.. జగన్ అంబటి పరామర్శ టూర్ బాద్యతలన్నీ చూశారు. ఇందుకు గానూ ఆమెకు అయిన ఖర్చు ఏకంగా ఇరవై కోట్ల రూపాయలట.
ఆ స్థాయిలో ఆమె జగన్ టూర్ ఏర్పాట్లు ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి పర్యవేక్షించారు. జగన్ రాగానే కొట్టడానికి గుమ్మడి కాయలు ఇవ్వడం మాత్రమే కాదు.. అలా కొట్టినందుకు ఒక్కో మహిళకు 500 రూపాయలిచ్చారామె. అదీ రజనక్క అంటే. ఇంతకీ ఈ ఇరవై కోట్ల వ్యయానికి గానూ జగన్ నుంచి ఆమెకు వచ్చిన ప్రతిఫలం.. గూంటూరు టూర్ లో రజనమ్మ అంటూ ఒక మాట ఆయన నోటి నుంచి జాలువారడం.
అంతా బాగుంది కానీ ఇప్పటికే వరుస కేసులతో సతమతమవుతున్నారు రజనక్క. చావు తప్పి కన్ను లొట్టబోయినట్టుగా మొన్నా మధ్య జైలుకు వెళ్లాల్సింది తృటిలో మిస్ అయ్యింది. ఇక కేసుల పరంపర అయితే ఆగడం లేదు. వచ్చే ఎన్నికల ఫలితాల్లో తమ పార్టీగానీ వస్తే.. అంటూ ఆమె బెదిరింపులు కూడా ఎంత మాత్రం తగ్గడం లేదు.
ఓకే. జగన్ వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడం అటుంచితే అసలు రజనక్కకు ఉన్న వ్యతిరేకతను బట్టీ చూస్తే.. చిలకలూరిపేటలో ఈ సారికి టికెట్ వస్తుందా? అన్న అనుమానముంది. ఎందుకంటే తాను ఎమ్మెల్యేగా ఉండగా.. సొంత పార్టీ నేతలను కూడా వదలకుండా వసూళ్లతో వేధించిన గతం రజనక్కది. అందుకే జగన్ ఆమె స్థానం మార్చారు. బై బ్యాడ్ లక్ అక్కడా రజనమ్మ ఆశలు నెరవేరాయా అంటే అదీ లేదు. దీంతో తిరిగి చిలకలూరిపేటే కావాలని ఆమె ట్రై చేశారు. అయితే జగన్ ఎంతకీ ఒప్పుకోక పోయే సరికి ఇటీవల అలిగి పార్టీకి దూరమయ్యారు.
ఇక ఆఖరి ఛాన్స్ అన్నట్టు జగన్ గుంటూరు ర్యాలీ బాధ్యతలన్నీ రజనక్క ఇరవై కోట్ల రూపాయలను ఖర్చు చేసి మరీ చూస్కున్నారంటే పరిస్థితి ఏమిటో ఊహించుకోవచ్చు. ఈ లెక్కన గత జగన్ పాలనలో అక్క వసూళ్ల రేంజ్ ఏంటో ఈ 20 కోట్ల ఖర్చే చెప్పక చెబుతోందని చతుర్లు విసురుతున్నారు కొందరు. ఏది ఏమైనా ఆల్ ద బెస్ట్ రజనక్క.. హోప్ ద బెస్ట్. మీకు టికెట్ రావాలనే ఆశిద్దామని సెటైర్లు వేస్తున్నారు చాలా మంది వైసీపీ కార్యకర్తలు.






