Latest News
కాఫీ కోసం చచ్చిపోతున్నా.. నెతన్యాహూ వీడియో అసలా? ఫేకా?
posted on: Mar 16, 2026 2:28PM

మీరు చనిపోయారంట కదా? అంటే అవును.. నేను కాఫీ కోసం చచ్చిపోతానంటూ.. ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమెన్ నెతన్యాహూ చెబుతున్నట్లుగా వెలుగులోకి వచ్చిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోతో పాటు ఆయన ఆరో వేలు కూడా చర్చనీయాంమైది. ఇంతకీ విషయమేంటంటే?.. ఇరాన్ దాడిలో నెతన్యాహూ చనిపోయారన్న వార్తలు వినవస్తున్న వేళ.. ఆయన లైఫ్ కండీషనేంటి? ఆ వీడియో ఫేకా? లేక ఒరిజనలా.. అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
తాను చనిపోయినట్టు వార్తలు వస్తున్న వేళ.. నెతన్యాహూ ఒక వీడియో రిలీజ్ చేశారు. అయితే ఈ వీడియో చుట్టూ ఇప్పుడు ఇంట్రస్టింగ్ డిబేట్ నడుస్తోంది. ఇది ఒరిజినల్ ఏనా? లేక ఏఐ జనరేటెడా అన్న చర్చ నడుస్తోంది. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే.. జెరూసలేం శివార్లలోని ఒక కాఫీ షాప్.. పేరు సతాఫ్ కేఫ్.. ఆ కేఫ్ లో నెతన్యాహూ కాఫీ ఆర్డర్ ఇస్తూ కనిపించారు. ఆ వీడియోలో ఆయన సహాయకుడు మీరు చనిపోయారని వార్తలు వస్తున్నాయని చెబుతుంటే.. అందుకు బదులుగా నెతన్యాహు ఔను అంటూ బదులిచ్చారు. దానికి కొనసాగింపుగా.. తాను కాఫీ కోసం చస్తున్నానని చమత్కరించారు. బేసిగ్గా హిబ్రూ లాంగ్వేజీలో ఒక విషయంపై విపరీతమైన ప్రేమాభిఆనాలున్నపుడు ఐయాం డయింగ్ ఫర్ దట్ అని అంటుంటారు. సరిగ్గా అదే మాటను ఆయన ఇక్కడ వాడారు.
అయితే ఈ వీడియోను ఏఐ జనరేటెడ్ వీడియో అంటున్నారు కొందరు. అందుకు కారణం గతంలో ఒక వీడియోలో ఆయనకు ఓ చేతికి ఆరు వేళ్లున్నట్టు కనిపించింది. అయితే తాజా వీడియోలో మాత్రం ఆయన ఒక్కో చేతికీ ఐదేసి వేళ్లు అంటే మొత్తం పది వేళ్లు మాత్రమే కనిపించాయి. దీంతో దీనిని ఫేక్ వీడియో, డీప్ ఫేక్ జనరేటెడ్ అంటున్నారు. అయితే ఈ వీడియోలో ఆయన తన రెండు చేతులనూ కెమెరాకు చూపిస్తూ ఆ వేళ్లను లెక్కబెట్టి మరీ తనకు ఆరో వేలు లేదంటూ క్లారిటీ ఇచ్చారనుకోండి అది వేరే సంగతి.
ఇది డీప్ ఫేక్ వీడియోగా ఎందుకని అంటున్నారంటే.. ఎక్స్ ప్లాట్ ఫామ్ లోని గ్రోక్ అనే చాట్ బాట్ ఈ వీడియో గురించి ఒక యూజర్ అడిగినపుడు ఇది హండ్రడ్ పర్సంట్ డీప్ ఫేక్ గా బదులిచ్చింది. దీంతో ఈ వీడియో విశ్వసనీయతపై సందేహాలు వ్యక్తమౌతున్నాయి. అలాగే.. వీడియోలో కప్పులోని కాఫీ కదలడం లేదని.. ఆయన ముఖంపై లైటింగ్ వింతగా ఉందంటూ నెటిజనులు కామెంట్లు పెడుతున్నారు. ఇంతకీ నెతన్యాహూకి కాఫీ సర్వ్ చేసిన ఆ షాప్ యాజమానన్యం మాత్రం నెతన్యాహు తమ షాప్ కి వచ్చారనీ స్పష్టంగా చెబుతున్నది. ఇంతకీ నిజానిజాలేంటన్న విషయంలో రాయిటర్స్ వంటి అంతర్జాతీయ వార్తా సంస్థలు చేసిన పరిశీలనలో ఈ వీడియో ఒరిజనలేనని తేలింది. ఇలాంటి వార్ సిట్యువేషన్లో ఇలాంటి ఇన్ఫోవార్స్ సైతం నడుస్తుంటాయి. కాబట్టి ప్రస్తుతం ఇవి కూడా అతి పెద్ద చర్చనీయాంశంగా మారాయి.


.webp)



