విశాఖ విమానాశ్రయంలో మాజీ మంత్రి విడదల రజనీ నిర్బంధం?

మాజీ మంత్రి విడదల రజనీని విశాఖ విమానాశ్రయంలో నిర్బంధించినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. వైసీపీ  హయాంలో  యడ్లపాడులోని శ్రీ లక్ష్మీ స్టోన్‌ క్రషర్స్ నిర్వాహకులను బెదిరించి రూ.2. 20 కోట్లు  వసూలు చేశారనే ఆరోపణలపై  మాజీ మంత్రి విడుదల రజని,  ఆమె మరిది గోపి, అలాగే వీరికి సహకరించిన  అధికారి  జాషూవా,  మాజీ మంత్రి  విడదల రజని పీఏ రామకృష్ణపైనా కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే.  ఇదే కేసులో విడదల రజని మరిది విడదల గోపీనాథ్ ను ఏసీబీ అధికారులు గురువారం (ఏప్రిల్ 24) ఉదయం హైదరాబాద్ లో అరెస్టు చేసి విజయవాడ తరలించిన సంగతి తెలిసిందే.  

ఈ కేసులో యాంటిసిపేటరీ బెయిలు కోసం మాజీ మంత్రి విడదల రజనీ, విడదల గోపీనాథ్ హైకోర్టును ఆశ్రయించారు. అలాగే  విజిలెన్స్ అధికారి జాఘువా సైతం హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసుకున్నారు. ఆ పిటిషన్లన్నీ విచారణ దశలో ఉన్న సంగతి తెలిసిందే. విడదల రజనీ యాంటి సిపేటరీ బెయిలు పిటిషన్ పై తీర్పు వాయిదా వేసిన కోర్టు, ఆమెకు అరెస్టు నుంచి మాత్రం ఎటు వంటి మినహాయింపూ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలోనే విదేశాలకు పరారీ అయ్యే అవకాశం ఉందన్న విశ్వసనీయ సమాచారంతో ఏసీబీ అధికారులు విడదల గోపీనాథ్ ను హైదరాబాద్ లో అదుపులోనికి తీసుకున్నారు. కాగా విడదల రజనీ దేశం విడిచి వెళ్లకుండా ఇప్పటికే రెడ్ అలర్ట్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే విశాఖ విమానాశ్రం నుంచి రజనీ విదేశాలకు వెళ్లకుండా  రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే విశాఖ విమానాశ్రయంలో విడదల రజనీని నిలిపివేసినట్లు తెలుస్తోంది. అయితే ఆమెను అరెస్టు చేశారా? లేక అడ్డుకున్నారా అన్న విషయంలో క్లారిటీ లేదు.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu