భాగస్వామ్య సదస్సును ప్రారంభించిన ఉప రాష్ట్రపతి

విశాఖలో భాగస్వామ్య సదస్సు ఆరంభమైంది.  విశాఖ వేదికగా శుక్రవారం (నవంబర్ 14) నుంచి రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సును ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్ ప్రారంభించారు.  ఈ సదస్సుకు దేశ, విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో పారిశ్రామిక వేత్తలు హాజరయ్యారు.  ఈ సదస్సులో రాష్ట్రానికి దాదాపు  10 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులకు పారిశ్రామిక వేత్తలు, సంస్థలతో ఒప్పందాలు జరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

  రెండు రోజులపాటు  32 సెషన్లుగా ఈ భాగస్వామ్య సదస్సు జరుగుతుంది.    గవర్నర్ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌, సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రులు పీయూష్‌ గోయల్, రామ్మోహన్‌నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, శ్రీనివాసవర్మ, రాష్ట్ర మంత్రి లోకేశ్ ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.   ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, స్పేస్, గ్రీన్ హైడ్రోజన్, పర్యాటకం, ఎంఎస్ఎంఈ, ఫైనాన్స్ రంగాలపై చర్చలు జరుగుతాయి. 

ఇలా ఉండగా తొలి రోజు సదస్సులో డ్రోన్ సిటీ, స్పేస్ సిటీలను ముఖ్యమంత్రి చంద్రబాబు వర్చువల్​గా ప్రారంభిస్తారు. ఉదయం 11-30 నుంచి 7:30 వరకూ ఏకకాలంలో పాతిక సెషన్లు జరుగుతాయి. రాత్రి 8-30 నుంచి హోటల్ రాడిసన్ బ్లూ రిసార్ట్​లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu