Latest News

మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసు.. నిందితుల కస్టడీ పిటిషన్‌పై తీర్పు వాయిదా

posted on: Mar 20, 2026 1:11PM

మొయినాబాద్‌ ఫామ్ హౌస్   డ్రగ్స్ కేసులో అరెస్టయిన నిందితుల కస్టడీ పిటిషన్‌పై ఉప్పరపల్లి కోర్టు తీర్పు వేసింది. కోర్టుకు వరుసగా రెండు రోజులు సెలవులు ఉండటంతో, తుది ఆదేశాలను సోమవారం ప్రకటించను న్నట్లు కోర్టు పేర్కొంది.ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న  రోహిత్ రెడ్డి సోదరుడు రితీష్ రెడ్డి, అలాగే నమిత్ శర్మలను పది రోజులపాటు పోలీస్ కస్టడీకి అప్పగించా లని దర్యాప్తు అధికారులు కోర్టును ఆశ్రయించారు.

నిందితులను కస్ట డీలోకి తీసుకుని విచారణ జరిపితే డ్రగ్స్ సరఫరా చైన్ విషయంలో  మరిన్ని కీలక వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసులు పేర్కొన్నారు.  అయితే కోర్టు సెలవుల నేపథ్యంలో  కోర్టు తీర్పును సోమవారానికి వాయిదా వేసింది.  దీంతో నిందితుల కస్టడీపై ఉత్కంఠ కొనసాగుతోంది.ఇ దిలా ఉండగా మరోవైపు ఈ కేసు దర్యాప్తులో  నింది తులు ఇస్తున్న సమాచారం  పరస్పర విరుద్ధంగా  ఉం ఉన్నట్లు సమాచారం. ఎవరి వాఖ్యలు నిజమో తెలుసు కునేందుకు అధికారులు సాక్ష్యాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు.

ఈ కేసుకు అంతర్జాతీయ లింకులు ఉన్నాయన్న అనుమానాల నేపథ్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందం  ఢిల్లీ, దుబాయ్ నగ రాలకు వెళ్లి విచారించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.  ఈ కేసులో కీలకంగా భావిస్తున్న పాపులర్ డ్రగ్ పెడ్లర్ అభిషేక్ సింగ్ కోసం పోలీసులు గాలింపు చర్యలను వేగవంతం చేశారు. 

పైలట్  రోహిత్ రెడ్డి డ్రైవర్ శరత్ ఇచ్చిన వివరాలు కూడా దర్యాప్తుకు కీలకంగా మారాయి. శరత్ వాంగ్మూలం   ఆధారం సిట్  దర్యాప్తు ముమ్మరం చేసింది. 

google-ad-img
    Related Sigment News
    • Loading...