శబరిమల ప్రవేశానికి వర్చువల్ క్యూపాస్
posted on Nov 20, 2025 9:43AM
.webp)
శబరిమల అయ్యప్పస్వామి దర్శనానికి వచ్చే భక్తుల రద్దీ రోజు రోజుకూ అధికమౌతున్న నేపథ్యంలో కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేరళ హైకోర్టు సూచనల మేరకు కొన్ని నిబంధనలు అమలు చేస్తోంది. భక్తుల రద్దీ దృష్ట్యా ఈ నిబంధనలు ఈ నెల 24 వరకూ కచ్చితంగా అమలు చేయనున్నట్లు కేరళ సర్కార్ ప్రకటించింది.
శబరిమలకు ఒకేసారి అధిక సంఖ్యలో యాత్రికులు చేరకుండా నియంత్రించేందుకు రోజువారీ అనుమతులకు పరిమితి విధించింది.అలాగే వర్చువల్ క్యూ ద్వారా రోజుకు 70,000మందిని మాత్రమే దర్శనానికి అనుమతిస్తారు. అదనంగా స్పాట్ బుకింగ్ ద్వారా మరో ఐదు వేల మందికి ప్రవేశం కల్పిస్తారు. కోటా పూర్తయిన వెంటనే స్పాట్ బుకింగ్ నిలిపి వేస్తారు. జరుగుతుంది.
శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి వర్చువల్ క్యూ పాస్ తప్పనిసరి చేసింది. దీంతో ఈ పాస్ లేకుండా నీలక్కల్ చెక్‌పాయింట్ నుంచి శబరిమలకు ఎవరినీ అనుమతించబోమని అధికారులు స్పష్టం చేశారు. భక్తుల స్పాట్ బుకింగ్ కోసం నీలక్కల్, వండిపెరియార్ సత్రం, ఎరుమెలి, చెంగన్నూర్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. నీలక్కల్ వద్ద కోటా చాలా వేగంగా ముగిసే అవకాశం ఉన్నందున, యాత్రికులు ఇతర కేంద్రాల్లోనే పాస్ పొందాలని సూచించారు.యాత్ర ప్రారంభించే ముందు పాస్ తమ వద్ద ఉన్నదని భక్తులు తప్పనిసరిగా నిర్ధారించుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది. అలాగే నీలక్కల్, పంపా, సన్నిధానం ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన భద్రతా చర్యలకు యాత్రి కులు సహకరించాల్సి ఉంటుంది. ఇతర రాష్ట్రాల భక్తుల కోసం 04735-14432 హెల్ప్ లైన్ నంబర్ ను ఏర్పాటు చేశారు. బరిమల యాత్రను మరింత క్రమబద్ధంగా, భద్రతగా నిర్వహించేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.