Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఎమ్మెల్సీగా వర్ల రామయ్య ప్రమాణ స్వీకారం.!
posted on: Aug 19, 2026 3:11PM
.webp)
ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యుడిగా తెలుగుదేశం సీనియర్ నాయకుడు వర్ల రామయ్య ప్రమాణ స్వీకారం చేశారు. శాసనమండలి లో గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాలు రెండు ఖాళీగా ఉన్న నేపథ్యంలో ఆ స్థానాల భర్తీకి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఇద్దరి పేర్లతో గవర్నర్ కు జాబితా పంపింది. వారిలో ఒకరు వర్ల రామయ్య కాగా మరొకరు దళవాయి రమాదేవి. ఈ మేరకు ప్రభుత్వ ప్రతిపాదనకు గవర్నర్ ఆమోదం తెలపడంతో వారిద్దరినీ నామినేట్ చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ప్రజా సేవ, పార్టీ పట్ల నిబద్ధత ప్రాతిపదికగా తీసుకుని కూటమి ప్రభుత్వం ఈ ఇద్దరినీ గవర్నర్ కోటా కింద ఎమ్మోల్సీలుగా ఎంపిక చేసింది. దీంతో నూతన ఎమ్మెల్సీగా వర్ల రామయ్య బుధవారం (ఆగస్టు 20) ప్రమాణ స్వీకారంచేశారు. మండలి ఛైర్మన్ కొయ్యే మోషేనురాజు వర్ల రామయ్య చేత ప్రమాణ స్వీకారం చేయించారు.
కాగా ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన వర్ల రామయ్య 26 సంవత్సరాల పాటు వివిధ హోదాల్లో పోలీసు శాఖలో సర్వీస్ చేశారు. పదవీ విరమణకు పదేళ్ల ముందే స్వచ్ఛంద పదవీ విరమణ చేసి 2001లో తెలుగుదేశం పార్టీలో చేరారు. పార్టీలో ఎస్సీ సెల్ బాధ్యతల నుంచి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వరకూ వివిధ పదవులను సమర్థంగా నిర్వహించారు. గతంలో గృహ నిర్మాణ సంస్థ, ఆర్టీసీ ఛైర్మన్‌గా కూడా బాధ్యతలు నెరవేర్చిన ఆయన, ప్రస్తుతం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా కొనసాగుతున్నారు.
ఇక గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎంపికైన దళవాయి రమాదేవి, తెలుగుదేశం కార్యకర్తగా ప్రస్థానం ప్రారంభించి, పార్టీ పిలుపునిచ్చిన ప్రతి కార్యక్రమంలో చురుకుగా పాల్గొన్నారు. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో అనేక ప్రతికూల పరిస్థితులు, ఒత్తిళ్లు ఎదురైనప్పటికీ అనంతపురం కార్పొరేషన్ ఎన్నికల్లో నిలబడి గట్టగి పోటీ ఇచ్చారు. అనంతపురం పరిధిలో పార్టీ అంగన్‌వాడీ విభాగం కన్వీనర్‌గా, యూనిట్ ఇన్‌ఛార్జిగా బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం పార్టీ క్లస్టర్ ఇన్‌ఛార్జిగా సేవలందిస్తున్నారు.
AP Governor Quota MLCs, Varla Ramaiah MLC, Dalavai Ramadevi MLC, AP Legislative Council, AP News Telugu



.webp)


