నూజివీడు కోర్టుకు హాజరైన వల్లభనేని వంశీ

posted on: Feb 17, 2026 12:04PM

గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు వల్లభనేని వంశీ నూజివీడు కోర్టులో హాజరయ్యారు. నకిలీ పట్టాల కేసులో వల్లభనేని వంశీ కోర్టుకు హజారయ్యారు. నకిలీ పట్టాల కేసులో పోలీసులు గతంలో వల్లభనేని వంశీ, మరో ఇద్దరు అతడి అనుచరులను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. కొన్ని వారాల రిమాండ్ తరువాత ఈ ముగ్గురికీ కూడా బెయిలు లభించింది.

కాగా ఆ కేసు విచారణ సందర్భంగా వల్లభనేని వంశీ సోమవారం (ఫిబ్రవరి 16) నూజివీడు కోర్టులో హాజరయ్యారు. వంశీతో పాటు ఈ కేసులో నిందితులుగా ఉన్న ఆయన అనుచరులు మోహనరంగారావు, సురేష్ లు కూడా కోర్టుకు హాజరయ్యారు.  కాగా న్యాయమూర్తి కేసు విచారణను మార్చి 2కు వాయిదా వేశారు.నకిలీ పట్టాల కేసు మాత్రమే కాకుండా వల్లభనేని వంశీపై అక్రమ ఇసుక తవ్వకాలు,  గన్నవరం తెలుగుదేశం కార్యాలపంపై దాడి సహా వివిధ పోలీసు స్టేషన్లలో పలు కేసులు ఉన్న సంగతి తెలిసిందే.  

google-ad-img
    Related Sigment News
    • Loading...