వెలంటైన్స్ రోజున ప్రియుడితో భర్తకు దొరిపోయిన భార్య

posted on: Feb 15, 2026 4:22PM

 

ఉత్తర్‌ప్రదేశ్‌లోని హాపూర్జిల్లాలో ఓ మహిళకు చేదు అనుభవం ఎదురైంది. ప్రేమికుల రోజు నాడు తన భర్తకు ప్రియుడితో కలిసి రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయింది. దాంతో సదరు భర్త ఆమె ప్రియుడ్ని నడిరోడ్డుపై చితకబాదాడు.  ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. హాపూర్‌లోని మీరట్ రోడ్డులో భార్య, తన ప్రియుడితో కలిసి బైక్‌పై తిరగడం భర్త చూశాడు. వెంటనే వారిని అక్కడే ఆపాడు. దీంతో ప్రియుడు, భర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. 

అక్కడున్న వారు కూడా భర్తకు మద్దతుగా నిలిచారు. ఈ క్రమంలోనే స్థానికులు ప్రియుడిని చితకబాదారు. పక్కనున్న వారు ఈ అంశాన్ని గమనిస్తూ.. మొబైల్లో రికార్డ్ చేశారు. అది కాస్తా నెట్టింట చక్కర్లు కొడుతోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు. భర్త ఆరోపణలతో ప్రియుడిపై కేసు నమోదు చేశారు పోలీసులు. ప్రేమికుల రోజైన ఫిబ్రవరి 14ర  వారిద్దరూ రోడ్లపై షికార్లు కొడుతూ పట్టుబడటం, భర్త చితక్కొడటం, కేసు నమోదు కావడం స్థానికంగా చర్చనీయాంశమైంది.

 

 

google-ad-img
    Related Sigment News
    • Loading...