Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...మంత్రి వాకిటి శ్రీహరికి అస్వస్థత.. ఆస్పత్రిలో చేరిక.!
posted on: Jul 17, 2026 10:57AM

తెలంగాణ మంత్రి వాకిటి శ్రీహరి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గత రెండు రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతుండటంతో, కుటుంబ సభ్యులు హైదరాబాద్ కేర్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఆయనకు అత్యవసర చికిత్స పొందుతున్నారు.
మంత్రి వాకిటి శ్రీహరి తీవ్రమైన జ్వరం, ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నట్లు ఆసుపత్రి వర్గాల సమాచారం. గత రెండు రోజులుగా ఆయన నీరసంగా ఉండటం, జ్వరం తగ్గకపోవడంతో ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం వాటికి శ్రీహరి ఆరోగ్యం నిలకడగా ఉందనీ, ఆందోళన చెందాల్సిన అవసరం లేదనీ వైద్యులు తెలిపారు. అయితే ఇన్ఫెక్షన్ తగ్గడానికి, జ్వరం నుంచి పూర్తిగా కోలుకోవడానికి మరో రెండు రోజుల పాటు ఆస్పత్రిలోనే ఉండి చికిత్స పొందాలని చెప్పారు.
వాకిటి శ్రీహరి ఆరోగ్య పరిస్థితిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరా తీశారు. ఆసుపత్రి వర్గాలతోనూ, కుటుంబ సభ్యులతోనూ మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు. శ్రీహరికి మెరుగైన వైద్య సేవలు అందించాలని సీఎం ఆదేశించారు. అలాగే మంత్రివర్గ సహచరులు, చెందిన పలువురు సీనియర్ నాయకులు మంత్రి వాకిటి శ్రీహరి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
Vakiti Srihari Health Condition, Minister Vakiti Srihari Unwell, Care Hospital Banjara Hills, CM Revanth Reddy Enquires Srihari Health


(9).webp)
.webp)


