Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...బేబీ బాస్ వరల్డ్ రికార్డు.!
posted on: Jul 24, 2026 8:45AM

క్రికెట్ లో బేబీ బాస్, యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ 15 ఏళ్ల పసి ప్రాయంలోనే ప్రపంచ రికార్డులు బద్దలు కొట్టేసి సంచలనాలు సృష్టిస్తున్నాడు. పిన్న వయసులో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన వైభవ్, అతి పిన్న వయస్సులో అంతర్జాతీయ క్రికట్ లో అడుగుపెట్టిన తొలి ఇండియన్ గా చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఇక తాను ఆడిన నాలుగో టి20 ఇంటర్నేషనల్ లోనే ప్రపంచ రికార్డు తిరగరాశాడు. జింబాబ్వేతో హరారే వేదికగా గురువారం (జులై 23) జరిగిన టీ20 మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ క్రికట్ గాడ్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న 37 ఏళ్ల రికార్డును బద్దలుకొట్టాడు. ఈ మ్యాచ్‌లో కేవలం 18 బంతుల్లోనే 4 ఫోర్లు, 4 సిక్సర్లతో అర్ధశతకం పూర్తి చేశాడు.
ఇంగ్లండ్‌తో ఆడిన తొలి మూడు మ్యాచ్ లలోనూ సిక్సర్లు బాదినా భారీ స్కోరు చేయడంలో విఫలమై నిరాశ పరిచిన ఈ కుర్రోడు.. జింబాబ్వేపై చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్ లో వైభవ్ సూర్యవంశీ తిరగరాసిన వరల్డ్ రికార్డులు ఏమిటంటే.. టీ20 క్రికెట్‌లో అతి పిన్న వయసులో హాఫ్ సెంచరీ చేసిన తొలి క్రికెటర్.. ఇంతకు ముందు ఈ రికార్డు లూయిస్ బ్రూస్ (16 ఏళ్ల 56 రోజులు) పేరిట ఉండేది. అయితే పూర్తిస్థాయి సభ్య దేశాల ఆటగాళ్లలో ఈ రికార్డు ఆఫ్ఘనిస్థాన్ బ్యాటర్ రహ్మానుల్లా గుర్బాజ్ (17 ఏళ్ల 296 రోజులు) పేరిట ఉంది.
అంతర్జాతీయ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లలో (టెస్టు, వన్డే, టీ20) కలిపి పూర్తిస్థాయి సభ్య దేశాల తరఫున అతి పిన్న వయసులో తొలి అర్ధశతకం నమోదు చేసిన ఆటగాడిగా సూర్యవంశీ నిలిచాడు. ఈ క్రమంలో 1989లో పాకిస్థాన్‌పై సచిన్ టెండూల్కర్ 16 ఏళ్ల 213 రోజుల వయసులో నెలకొల్పిన రికార్డును సూర్యవంశీ బద్దలుకొట్టాడు.
అసోసియేట్ దేశాలను కూడా పరిగణనలోకి తీసుకుంటే, పురుషుల అంతర్జాతీయ క్రికెట్‌లో 50+ స్కోరు చేసిన అత్యంత పిన్న వయస్కుడిగా కూడా సూర్యవంశీ నిలిచాడు. గతంలో నేపాల్ ఆటగాడు కుశల్ మల్లా 15 ఏళ్ల 340 రోజుల వయసులో ఈ ఘనత సాధించగా, ఇప్పుడు సూర్యవంశీ ఆ రికార్డును కూడా అధిగమించి భారత క్రికెట్‌లో ఓ సరికొత్త అధ్యాయానికి నాంది పలికాడు.
Vaibhav Suryavamshi world record, Zimbabwe, t20match, Halfcentury


.webp)



