Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...తెలంగాణలో నిలిచి పోయిన వాహన్–సారథి సాఫ్ట్‌వేర్
posted on: Jun 15, 2026 4:15PM

హైదరాబాద్‌తో పాటు తెలంగాణ వ్యాప్తంగా రవాణా శాఖకు సంబంధించిన వాహన్, సారథి సాఫ్ట్‌వేర్ సేవలు అకస్మాత్తుగా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని ఆర్టీఏ కార్యాలయాల్లో డ్రైవింగ్ లైసెన్స్, లెర్నర్స్ లైసెన్స్, వాహన రిజిస్ట్రేషన్, యాజమాన్య బదిలీ, ఫిట్‌నెస్ సర్టిఫికేట్, పర్మిట్‌లకు సంబంధించిన సేవలు పూర్తిగా స్తంభించిపోయాయి.
సాఫ్ట్‌వేర్ పనిచేయకపోవడంతో ముందస్తుగా అపాయింట్‌మెంట్‌లు తీసుకుని వచ్చిన వాహనదారులు, డ్రైవింగ్ లైసెన్స్ అభ్యర్థులు గంటల తరబడి కార్యాలయాల వద్ద వేచి ఉండాల్సి వచ్చింది. పలు జిల్లాల్లో రవాణా శాఖ కార్యాలయాల వద్ద భారీ క్యూలు కనిపించాయి. సేవలు ఎప్పుడు పునరుద్ధరించబడతాయో స్పష్టత లేకపోవడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు.
సాంకేతిక లోపం కారణంగానే సారథి సాఫ్ట్‌వేర్‌లో సమస్య తలెత్తినట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించినట్లు సమాచారం. సమస్య పరిష్కారానికి సాంకేతిక నిపుణులు చర్యలు చేపట్టారని, మరో గంటలో సేవలు పునరుద్ధరించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.
అయితే తరచూ ఇలాంటి సర్వర్ సమస్యలు తలెత్తడం వల్ల ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయని వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఉద్యోగాలు, వ్యాపార పనుల కోసం వచ్చిన వారు తమ పనులు పూర్తికాక నిరాశతో వెనుదిరిగిన పరిస్థితి ఏర్పడింది. రవాణా శాఖ అధికారులు సాఫ్ట్‌వేర్ సమస్య పూర్తిగా పరిష్కారమైన వెంటనే పెండింగ్‌లో ఉన్న సేవలను వేగంగా అందిస్తామని తెలిపారు. సేవల పునరుద్ధరణపై అధికారిక ప్రకటన కోసం వాహనదారులు ఎదురుచూస్తున్నారు.






