Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలనకు వ్యతిరేకంగా తీర్పు
posted on: Mar 29, 2016 3:30PM
ఉత్తరాఖండ్ అసెంబ్లీని రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ఆ రాష్ట్ర హైకోర్టు తిప్పి కొట్టింది. ఆ రాష్ట్రంలోని హరీశ్ రావత్ ప్రభుత్వం మైనారటీలో పడిపోయిందంటూ కేంద్రం విధించిన రాష్ట్రపతి పాలనకి విరుద్ధంగా నేడు హైకోర్టు తీర్పునిచ్చింది. తాజా తీర్పు ప్రకారం హరీశ్ రావత్ ఈ నెల 31న అక్కడి అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకునే అవకాశం దక్కింది. 71 మంది సభ్యులు ఉన్న ఉత్తరాఖండ్ అసెంబ్లీలో కాంగ్రెస్‌కు 36మంది సభ్యుల బలం ఉంది. అయితే వీరిలో 9 మంది బీజేపీ పంచన చేరడంతో, అధికారపక్షం బలహీనమైపోయింది.
ఇలాంటి పరిస్థితుల్లో హరీశ్ రావత్ తన బలాన్ని ఎలా నిరూపించుకుంటారో వేచి చూడాలి. పైగా తిరుగుబాటు ఎమ్మెల్యేల మీద వేటు వేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కూడా హైకోర్టు ఆమోదించలేదు. తిరుగుబాటు ఎమ్మెల్యేలు కూడా ఈ ఓటింగ్‌లో పాల్గొనవచ్చంటూ న్యాయస్థానం అవకాశాన్ని అందించింది. ఈ తతంగం ముగిసేవరకూ కూడా హరీశ్‌రావత్‌ను ముఖ్యమంత్రిగా భావించాలంటూ న్యాయస్థానం పేర్కొంది. మరోపక్క ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలనని అన్యాయంగా విధించారంటూ సుప్రీంకోర్టులో వేసిన ప్రజావ్యాజ్యాన్ని, కోర్టు విచారణకు స్వీకరించింది. దీంతో ఇటు హైకోర్టు, అటు సుప్రీం కోర్టు నుంచి కేంద్రానికి అక్షింతలు తప్పేట్లు లేవు.




