Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...యూపీ కోటలో కాషాయ జెండా రెపరెపలు
posted on: Mar 12, 2017 4:20PM
.png)
ఉత్తరప్రదేశ్ కోటపై కాషాయ జెండా ఎగిరింది. యూపీ ఓటర్లు బీజేపికి పట్టం కట్టారు. అత్యధిక సీట్లు కైవసం చేసుకుని బీజేపీ రికార్డులు తిరగరాసింది. మొత్తం 403 అసెంబ్లీ స్థానాలున్న యూపీలో కాషాయ పార్టీ 324 స్థానాల్లో గెలిచి విజయదుందుభి మోగించింది. కాంగ్రెస్ తో జట్టుకట్టిన సమాజ్‌వాదీ పార్టీ.... బీజేపీ ప్రభంజనంలో కొట్టుకుపోయింది. అఖిలేష్ మంత్రివర్గంలోని పలువురు మంత్రులు ఘోర పరాజయం పాలయ్యారు.
ములాయం ప్రియ సోదరుడు శివపాల్ యాదవ్, చిన్న కోడలు అపర్ణా యాదవ్, నమ్మిన బంటు ఆజం ఖాన్ తదితరులు చిత్తుగా ఓడిపోయారు. ప్రజా తీర్పుని శిరసా వహించి ఓటమిని అంగీకరిస్తున్నట్టు ఎస్పీ తెలిపింది. పదహారేళ్ల తర్వాత రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వస్తోందన్న ఆనందంలో కమలదళం కార్యకర్తలు ఆనందంలో మునిగిపోయారు. లక్నో , ఢిల్లీ బీజేపీ కార్యాలయాల్లో పండుగ వాతావరణం కనిపించింది. బాణాసంచా కాల్చి, రంగులు జల్లుకుని ఒకరికొకరు మిఠాయిలు పంచుకున్నారు.


.jpg)



