Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఇదో అమెరికన్ డ్రగ్ బానిసల స్టోరీ!
posted on: Jul 27, 2017 10:42AM
.jpg)
ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా డ్రగ్స్ చర్చలే! అందులోనూ సినిమా వాళ్లు మత్తులో జోగుతున్నారని బయటకి పొక్కటంతో అందరిలోనూ ఎక్కడలేని ఆసక్తి బయలుదేరింది. కానీ, డ్రగ్స్ కేవలం వెనుకబడ్డ ఆఫ్రికా దేశాలు, లేదంటే ఇండియా లాంటి ఎదుగుతున్న దేశాలు… వీటిలో మాత్రమే వుంటాయనుకుంటే పొరబాటే! అమెరికా లాంటి అగ్ర దేశంలో మనకన్నా ఎక్కువ డ్రగ్స్ దందా సాగుతుంది! అక్కడ ఇక్కడి కంటే ఎక్కువ మంది డ్రగ్ ఎడిక్ట్స్ వుంటారు. ఆటగాళ్లు, పాటగాళ్లు, సినిమా వాళ్లు … ఇలా ఎవరు పడితే వారు డ్రగ్స్ బాధితులే! కానీ మన దగ్గర మరీ స్కూలు పిల్లలు కూడా మత్తు పదార్థాలకి బానిసలు కావటం అందర్నీ షాక్ కి గురి చేసింది. కాని, అమెరికాలోని ఉటా నగరంలో అప్పుడే పుట్టిన పాపకే డ్రగ్స్ అలవాటున్నట్టు తెలిసి పోలీసులు, ఆసుపత్రి సిబ్బంది అంతా దిమ్మ తిరిగి మైండ్ బ్లాంకైపోయారు!
ఇంతకీ ఏం జరిగిందంటే… అమెరికాలోని ఓ జంట… కాల్ వైల్డ్, క్రిస్టిన్సన్. ఈ భార్య, భర్తలకి ఇద్దరు బాబులు. అయితే, గత ఏప్రెల్ లో క్రిస్టిన్సన్ మరో కూతురికి జన్మనిచ్చింది. కాని, అప్పటికే డ్రగ్ ఎడిక్ట్ అయిన ఆమె గర్భంతో వుండగానే మస్తుగా మత్తు మందు పుచ్చుకుంది. భర్తతో కలిసి ఆమె చేసిన ఈ దారుణానికి పుట్టిన బిడ్డ తల్లి కడుపులోంచే డ్రగ్ ఎడిక్ట్ గా ఊపిరి పోసుకుంది. అది హాస్పిటల్ సిబ్బందికి తెలిస్తే పోలీసులకి పట్టిస్తారని భయపడ్డ క్రిస్టిన్సన్, కాల్ వైల్డ్ డ్రగ్ ఎడిక్షన్ తెలియకుండా చేసే మరో మందు తీసి పుట్టిన బిడ్డ చిగుళ్లకి పూసేశారు! కాని, ఇదంతా ఆసుపత్రి వారికి ఎలాగో తెలియనే తెలిసింది. వాళ్లిచ్చిన కంప్లైంట్ తో పోలీసులు డ్రగ్ కపుల్ ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు!
పుట్టీ పుట్టగానే బిడ్డ ప్రాణాలతో చెలగాటాలు ఆడుతూ ప్రమాదకార మందు పట్టించిన అమెరికన్ కపుల్ గతంలోనూ అనేక కేసుల్లో ఇరుక్కున్నారట. వాల్ మార్ట్ లో దొంగతనం చేస్తూ పట్టుబడటంతో పోలీసులు లోతుగా విచారణ జరిపారు. మళ్లీ తరువాత ఏప్రెల్ లో అప్పుడే బిడ్డకు మందు పట్టించి అరెస్ట్ కావటంతో సదరు మమ్మీ , డాడీల ఇళ్లంతా సోదా చేశారు! వాళ్లకు దొరికిన డ్రగ్స్ చూసి అమెరికన్ పోలీసులే అవాక్కయ్యారు! హెరాయిన్ తో సహా మరో రెండు , మూడు రకాల ప్రాణాంతక మాదక ద్రవ్యాలు లభించాయి! అంతే కాదు, క్రిస్టిన్సన్ కు పుట్టిన కూతురు కంటే ముందు సంతానమైన ఇద్దరు అబ్బాయిలు కూడా డ్రగ్స్ టెస్ట్ లో పాజిటివ్ గా నిలిచారట! మొత్తానికి ముగ్గురు చిన్నారుల జీవితాలతో ఆటలాడిన ఆ వైఫ్ అండ్ హజ్బెండ్ ని ఇప్పుడు కటకటాల్లో వుంచి కోర్టులో హాజరుపరుస్తున్నారు. అమెరికన్ చట్టాల ప్రకారం వారు మళ్లీ బయటకి చాలా ఏళ్లే పట్టొచ్చు! అప్పటిలోగా ప్రస్తుతం క్రిస్టిన్సన్ మొదటి భర్త వద్ద పెరుగుతోన్న ఆమె నలుగురు సంతానం పెరిగి పెద్దవారు కూడా అయిపోతారు! ఇదీ ది గ్రేట్ అమెరికన్ లైఫ్ స్టైల్…



.jpg)


