Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...'ఉస్తాద్ భగత్ సింగ్' సెన్సార్ టాక్.. 'ధురంధర్-2'ని ఢీ కొట్టే కంటెంట్ ఉందా?
posted on: Mar 10, 2026 5:48PM

- సెన్సార్ పూర్తి చేసుకున్న 'ఉస్తాద్ భగత్ సింగ్'
- సెన్సార్ టాక్ ఎలా ఉంది?
- 'గబ్బర్ సింగ్'లా మరో బ్లాక్ బస్టర్ అవుతుందా?
- తెలుగునాట 'ధురంధర్-2'కి షాక్ ఇస్తుందా?
గతేడాది 'ఓజీ'తో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan), ఈ ఏడాది 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh)తో మరోసారి తన బాక్సాఫీస్ పవర్ చూపించాలి అనుకుంటున్నారు. 'గబ్బర్ సింగ్' వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తరువాత పవన్ కళ్యాణ్, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఇది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.
'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా తాజాగా సెన్సార్ పూర్తి చేసుకుంది. ఎటువంటి కట్స్ లేకుండా సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్ ఇచ్చింది. మూవీ రన్ టైమ్ 2 గంటల 34 నిమిషాలుగా లాక్ చేసినట్లు సమాచారం.
'ఉస్తాద్ భగత్ సింగ్'కి సెన్సార్ నుంచి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చినట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు, అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చేలా దర్శకుడు హరీష్ శంకర్ మలిచాడట. మాస్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా కనెక్ట్ అయ్యేలా ఒక మంచి కమర్షియల్ ఎంటర్‌టైనర్ గా రూపొందించారట.

ఈ సినిమాను మొదట మార్చి 26న విడుదల చేయాలి అనుకున్నారు. లాంగ్ వీకెండ్, హాలిడేస్ ని దృష్టిలో పెట్టుకొని మార్చి 19 కి ప్రీ పోన్ చేశారు. అదే రోజు 'ధురంధర్-2' పాన్ ఇండియా వైడ్ గా విడుదలవుతున్నప్పటికీ.. పవర్ స్టార్ స్టార్డమ్, కంటెంట్ మీద నమ్మకంతో అదే రోజు ఉస్తాద్ కూడా బరిలోకి దిగుతుండటం విశేషం.
'ఉస్తాద్ భగత్ సింగ్' టీం ప్రమోషన్స్ లో జోరు పెంచింది. తాజాగా థర్డ్ సింగిల్ 'కాలరే ఎత్తరా' ప్రోమోను విడుదల చేసింది. ఫుల్ సాంగ్ మార్చి 12 విడుదల కానుంది. త్వరలోనే ట్రైలర్ ను రిలీజ్ చేయడంతో పాటు, భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని కూడా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.





