Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...అమెరికా ఇరాన్ ఒప్పందం ఆమోదయోగ్యం కాదు.. కుండబద్దలు కొట్టిన నెతన్యాహు
posted on: Jun 16, 2026 8:55AM
.webp)
అమెరికా, ఇరాన్ దేశాల మధ్య కుదిరిన శాంతి ఒప్పందంపై ఇజ్రాయెల్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. పశ్చిమ ఆసియాలో యుద్ధ వాతావరణాన్ని ముగించడానికి వాషింగ్టన్-టెహ్రాన్‌ల మధ్య కుదిరిన ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ.. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అమెరికా, ఇరాన్ మధ్య ఒప్పందం కుదరడం, కుదరకపోవడంతో సంబంధం లేకుండా.. ఇరాన్ అణ్వాయుధాన్ని సాధించడాన్ని ఇజ్రాయెల్ ఎప్పటికీ అంగీకరించదని తేల్చిచెప్పారు.
జెనీవా వేదికగా అమెరికా-ఇరాన్ దేశాలు అధికారిక శాంతి పత్రాలపై ఈ నెల 20న సంతకాలు చేయడానికి సంతకాలు చేయడానికి సిద్ధమవుతున్న తరుణంలో నెతన్యాహు చేసిన ఈ వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి. ఈ ఒప్పందంలో తక్షణ కాల్పుల విరమణ, హర్మూజ్ జలసంధి పునఃప్రారంభంతో పాటు.. ఇరాన్ అణు పరిమితులపై రాబోయే 60 రోజుల్లో చర్చలు జరపాలని అమెరికా భావిస్తోంది. అయితే, ఇరాన్ అణు సామర్థ్యాలను పూర్తిగా నిర్వీర్యం చేయడంలో ఈ ఒప్పందం విఫలమైందని నెతన్యాహు అన్నారు.
ఈ ఒప్పందంలోని కొన్ని నిబంధనల తాము అంగీకరించబోమని కుండబద్దలు కొట్టేశారు. దక్షిణ లెబనాన్ సరిహద్దుల్లో వ్యూహాత్మక స్థావరాల నుంచి తమసైన్యాన్ని వెనక్కి పిలిపించే ప్రసక్తే లేదని నెతన్యాహు స్పష్టం చేశారు. తమ దేశ సరిహద్దులను, పౌరులను రక్షించుకోవడానికి ఆ ప్రాంతంలో సెక్యూరిటీ జోన్లను' కొనసాగించడం ఇజ్రాయెల్‌కు అత్యంత అవసరమనిసపేర్కొన్నారు. ఇరాన్, అమెరికా మధ్య శాంతి ఒప్పందం కుదిరిందన్న ప్రకటన వెలువడిన గంటల వ్యవధిలోనే.. ఇజ్రాయెల్ ఆర్మీ.. దక్షిణ లెబనాన్‌లోని హిజ్బుల్లా ఉగ్రవాద స్థావరాలపై ఇజ్రాయెల్ ఆర్మీ దాడులకు దిగింది.
అయితే నెతన్యాహు వైఖరి పట్ల ఇజ్రాయెల్లో వ్యతిరేకత వ్యక్తమౌతోంది. యుద్ధాన్ని ఆపడానికి అమెరికా ప్రయత్నిస్తుంటే, నెతన్యాహు మొండివైఖరి వల్ల ఇజ్రాయెల్ ఒంటరి అయ్యే ప్రమాదం ఉందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.






