Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ట్రంప్ మానసిక స్థితి సరిగ్గానే ఉందా?
posted on: May 1, 2026 7:26PM

అమెరికా అధ్యక్షుడి మానసిక స్థితి సరిగ్గానే ఉందా.. అన్న అంశం మరోసారి ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తాజాగా అమెరికా పార్లమెంటులో రక్షణ మంత్రిని పీట్ హెగ్సెత్‌ను ను ఎంపీ సారా జాక్సబ్ ..మీ అధ్యక్షుడికి మతి స్థిమితం ఉందా? అని ప్రశ్నించారు. దీనిపై తీవ్రంగా స్పందించిన పీట్ హెగ్సెత్ ఇలాంటి ప్రశ్న మీరు ఎప్పుడైనా యూఎస్ మాజీ ప్రెసిడెంట్ బైడెన్‌ను అడిగారా అంటూ ఎదురు దాడి చేశారు. దీనికి సారా జాకబ్స్ కూడా ఏడాదిన్నరగా అధ్యక్షుడిగా ఉంది ట్రంపే నంటూ ఘాటుగా రిప్లై ఇచ్చారు.
ఇరాన్, అమెరికా మధ్య యుద్ధం ముదురుతున్న వేళ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నాయకత్వ పటిమపై విపక్షాలు విరుచుకు పడుతున్నాయి. ముఖ్యంగా ఆయన సోషల్ మీడియా చేస్తున్న పోస్టులు, అర్ధరాత్రి పూట చేస్తున్న హెచ్చరికల నేపథ్యంలో 'ట్రంప్ మానసిక స్థితి అసలు నిలకడగానే ఉందా" అనే చర్చ తెరపైకి వచ్చింది. దీనిపై కాపిటల్ హిల్‌లో జరిగిన విచారణలో.. అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్‌ను డెమోక్రాట్ ఎంపీలు నిలదీశారు. కాంగ్రెస్ విచారణలో డెమోక్రాట్ సభ్యురాలు సారా జాకబ్స్ నేరుగా రక్షణ మంత్రిని ..అమెరికా సైన్యానికి సర్వ సైన్యాధ్యక్షుడిగా వ్యవహరించేందుకు ట్రంప్ మానసిక స్థితి సరిగ్గా ఉందా? అని నిలదీశారు.
దీనిపై తీవ్రంగా స్పందించిన పీట్ హెగ్సెత్.. గత నాలుగేళ్లలో జో బైడెన్ విషయంలో ఎప్పుడైనా ఇలాంటి ప్రశ్నలు అడిగారా? అంటూ ఎదురుదాడికి దిగారు. దానికి జాకబ్స్ స్పందిస్తూ .. బైడెన్ ఇప్పుడు అధ్యక్షుడు కాదు. ఏడాదిన్నరగా ట్రంప్ అధికారంలో ఉన్నారని బదులిచ్చారు. దీనిపై మరింత ఆగ్రహం వ్యక్తం చేసిన హెగ్సెత్.. తమ అధ్యక్షుడిని కించపరిచేలా అడిగే ఈ ప్రశ్నలకు తాను సమాధానం ఇవ్వనని, ఆయన సైన్యాన్ని అగ్రస్థానంలో నిలిపే గొప్ప నాయకుడని వెనకేసుకొచ్చారు.
ఇరాన్‌తో శాంతి చర్చలు విఫలమవుతున్న తరుణంలో.. ట్రంప్ తన సోషల్ మీడియాలో చేస్తున్న పోస్టులు అమెరికా ప్రజలను కలవర పెడుతున్నాయి. ఒక సందర్భంలో ఆయన.. "ఇరాన్ నా డిమాండ్లను అంగీకరించకపోతే.. నేటి రాత్రే వారి నాగరికత అంతమైపోతుంది" అంటూ తీవ్రస్థాయిలో హెచ్చరించారు. అంతేకాకుండా తనను తాను దైవంగా చిత్రించుకునేలా ఏఐ ద్వారా రూపొందించిన చిత్రాన్ని పోస్ట్ చేసి విమర్శల పాలయ్యారు. తన చేతుల నుంచి దివ్య కాంతి వస్తున్నట్లు ఉన్న ఆ ఫోటోను తర్వాత తొలగించిన ట్రంప్.. తాను ప్రజల కష్టాలు తీర్చే డాక్టరు లాంటి వాడినని సర్దిచెప్పుకున్నారు. ఆ క్రమంలో ట్రంప్ మెంటల్ బ్యాలెన్స్‌పై తిరిగి చర్చ మొదలవ్వడంప్రాధాన్యత సంతరించుకుంది.






