Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఇరాన్ పై అమెరికా దాడులు ఉధృతం.!
posted on: Jul 30, 2026 9:32AM
.webp)
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పీక్స్ కు చేరాయి. తమ సైనిక బలగాలపై ఇరాన్ దాడికి ప్రయత్నించిందన్న ఆరోపణలతో అమెరికా ఇరాన్ లక్ష్యంగా సైనిక దాడులు చేపట్టింది. కొన్ని నెలలుగా కొనసాగుతున్న సంఘర్షణకు ఇది పరాకాష్టగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. బుధవారం (జులై 29)
ఇరాన్‌పై దాడులు ప్రారంభించినట్లు యూఎస్ సెంట్రల్ కమాండ్ (సెంట్ కామ్) ప్రకటించింది. పశ్చిమాసియాలోని అమెరికా స్థావరాలు, బలగాలపై ఇరాన్ దాడి ప్రయత్నానికి ఇది మా సమాధానమంటూ సెంట్‌కామ్ పేర్కొంది. జోర్డాన్‌లోని అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ క్షిపణి దాడులకు పాల్పడిన ఒక రోజు వ్యవధిలోనే అమెరికా ప్రతీకార దాడులకు పాల్పడటం గమనార్హం.
అమెరికా దాడుల తీవ్రత, లక్ష్యాల వివరాలను సెంట్‌కామ్ వెల్లడించలేదు. అయినప్పటికీ ఇరాన్‌లోని పలు ప్రాంతాల్లో పేలుళ్లు సంభవించినట్లు మీడియా వెల్లడించింది. దక్షిణ ప్రావిన్సులైన హార్మోజ్‌గాన్, ఖుజెస్థాన్‌తో పాటు పర్షియన్ గల్ఫ్‌లోని కొన్ని దీవులపై దాడులు జరిగినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా పేర్కొంది.
క్వెష్మ్ ద్వీపంలోని నివాస ప్రాంతాలపై దాడులు జరగడంతో శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించడం కోసం సహాయక చర్యలు చేపట్టినట్లు పేర్కొంది. కాగా సైనిక దాడులతో పాటు ఇరాన్‌పై నావికా దిగ్బంధనాన్ని కూడా కఠినతరం చేసినట్లు వెల్లడించిన సెంట్ కామ్.. బుధవారం (జులై29) నాటికి 20 వాణిజ్య నౌకలను దారి మళ్లించామని, రెండు నౌకలను నిలిపివేశామని, మరో రెండు నౌకలను తనిఖీ చేశామని పేర్కొంది.
US intensify attacks on Iran, West Asia, Tenssions, Peak, hermouz, Blocade, Continue


.webp)



