Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఆంక్షలు సడలించిన అమెరికా.. ఇండియాకు భారీ ఊరట.!
posted on: Jul 15, 2026 8:56AM

రష్యాపై కఠిన ఆర్థిక ఆంక్షలను విధించేందుకు ఉద్దేశించిన కీలక బిల్లులో అమెరికా చేసిన సవరణలు భారత్ కు భారీ ఊరట కలిగించాయి. రష్యా నుండి పెద్ద ఎత్తున ముడి చమురు, సహజవాయువును దిగుమతి చేసుకుంటున్నఇండియా, చైనా వంటి ఆసియా దేశాలపై ప్రతిపాదించిన 500 శాతం అదనపు సుంకాలను ఈ సవరణల ద్వారా గణనీయంగా తగ్గించింది. ప్రపంచ ఇంధన మార్కెట్లలో వ్యక్తమౌతున్న తీవ్ర ఆందోళనల నేపథ్యంలో అమెరికా తీసుకున్న ఈ నిర్ణయం భారత్ కు భారీ ఉపశమనాన్ని ఇచ్చిందనడంలో ఎలాంటి సందేహానికీ తావులేవు.
అమెరికా సెనెటర్ల సవరణతో అమెరికా చట్టసభ ఈ నూతన బిల్లును మంగళవారం (జులై 14) ఆమోదం తెలిపింది. గతంలో రష్యా నుండి ఇంధనాన్ని కొనుగోలు చేసే ప్రధాన దేశాలపై గరిష్టంగా ఏకంగా 500 శాతం వరకు భారీ టారిఫ్‌లను విధించాలని బిల్లులో అమెరికా ప్రతిపాదించింది. అయితే.. తాజా సవరణల మేరకు ఆ టారిఫ్ ను వంద శాతానికి తగ్గించింది. ఈ కొత్త ప్రతిపాదనల ప్రకారం టారిఫ్‌ల విధింపునకు సంబంధించిన పూర్తి అధికారాలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు కట్టబెట్టినట్లైంది. అంతే కాకుండా, దేశ ప్రయోజనాలను, దౌత్య సంబంధాలను దృష్టిలో ఉంచుకుని అవసరమైన సందర్భాలలో కొన్ని దేశాలకు మినహాయింపులు ఇచ్చే ప్రత్యేక వెసులుబాటును కూడా అధ్యక్షుడికి దఖలు పడింది.
గత నాలుగేళ్లుగా సాగుతున్న ఉక్రెయిన్, రష్యా యుద్ధం నేపథ్యంలో.. రష్యా నుంచి లభిస్తున్న రాయితీ ముడి చమురు ఇండియా అధికంగా దిగుమతి చేసుకుంటున్న సంగతి విదితమే. ఈ నేపథ్యంలో రష్యా యుద్ధ వ్యయాలకు నిధులు అందకుండా కట్టడి చేయడంతో పాటు, ప్రపంచ ఇంధన సరఫరా వ్యవస్థ దెబ్బతినకుండా చూడటం, అలాగే అమెరికా అంతర్జాతీయ వాణిజ్య సంబంధాలను కాపాడుకోవడమే లక్ష్యంగా ట్రంప్ 500శాతం టారిఫ్ లను ప్రతిపాదించారు. అయితే.. అన్ని వైపుల నుంచీ వచ్చిన ఒత్తిడి కారణంగా ఆ బిల్లుకు సవరణలు చేయకతప్పలేదు.
US Russia sanctions bill, India Russia oil trade, Donald Trump oil tariffs, Russia sanctions relaxation, US India energy relations, Lindsey Graham Russia bill






